Asianet News TeluguAsianet News Telugu

2021లో అద్భుతం జరగబోతుందన్న రజిని మాటల్లోని ఆంతర్యం ఇదే... కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్

రజినీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి కమల్ తోపాటు కలిసి నడవడానికి సిద్ధమని ప్రకటించాడు. దీనితో ఇరువురు సూపర్ స్టార్లు తమిళ రాజకీయాల్లో కలిసి చరిత్ర సృష్టించబోతున్నారంటూ, సోషల్ మీడియాలో వారి అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు

the true meaning of rajinikanth's 2021 miracle is dmk-congress forming the government says congress mp
Author
Kanyakumari, First Published Nov 24, 2019, 3:10 PM IST

చెన్నై: తమిళనాడు ఎన్నికలకు ఇంకో సంవత్సరానికి పైబడే సమయం ఉన్నప్పటికీ తమిళనాట రాజకీయాలు మాత్రం ఇప్పడికే వేడెక్కిపోయాయి. ఉన్న అన్ని పక్షాలు కూడా తామంటే తాము వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రెస్ మీట్లు పెట్టిమరీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. 

Also read: తమిళ రాజకీయాలు: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు, వెర్రెక్కీ ఉన్నోళ్లు...

ఇకపోతే రజినీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి కమల్ తోపాటు కలిసి నడవడానికి సిద్ధమని ప్రకటించాడు. దీనితో ఇరువురు సూపర్ స్టార్లు తమిళ రాజకీయాల్లో కలిసి చరిత్ర సృష్టించబోతున్నారంటూ, సోషల్ మీడియాలో వారి అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు. ఏకంగా రజినీకాంత్ 2021లో తమిళనాడులో అద్భుతం జరగబోతుందంటూ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 

రాష్ట్రంలో డీఎంకే- కాంగ్రెస్‌ పాలన వస్తుందనేది రజనీకాంత్‌ చెబుతున్న అద్భుతమని కాంగ్రెస్‌ ఎంపీ వసంత కుమార్‌ అన్నారు. కన్యాకుమారిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పరోక్ష పద్థతిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడమే అని ఆయన అభిప్రాయపడ్డారు.  

తమ సమస్యలను పరిష్కరించే వారిని ప్రతినిధులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకుంటారని, కానీ అధికార అన్నాడీఎంకే అప్రజాస్వామికంగా పరోక్ష ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపించారు. 

డబ్బున్న,పలుకుబడి ఉన్న వారిని మాత్రమే, స్థానిక సంస్థల పదవుల్లో కూర్చొబెట్టాలనేదే అన్నాడీఎంకే ఉద్దేశంగా వుందని ఆక్షేపించారు. ఇలాంటి దుర్మార్గపు అన్నాడీఎంకే పాలనకు  చరమగీతం పాడి డీఎంకే-కాంగ్రెస్‌ పాలన రావాలనేదే రజనీకాంత్‌ వెలుబుచ్చిన అద్భుతానికి అర్థం అని అన్నారు. 

Also read: 2021లో బిగ్ మిరాకిల్, కమల్ తో దోస్తీపై....: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

అక్కడితో ఆగకుండా రజినీకాంత్, కమల్ హాసన్ లకు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు.  రజనీ, కమల్‌లు డీఎంకే-కాంగ్రెస్‌ కూటమిలో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు ఈ సదరు ఎంపీ పిలుపునిచ్చారు. తమిళనాడు లోని కన్యాకుమారి పార్లమెంటు నియోజకవర్గానికి ఈ సదరు ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తమిళనాడు లోనే అతిపెద్ద గృహోపకరణాల పంపిణీదారైన వసంత్ అండ్ కో ఓనర్ ఈ ఎంపీ వసంతకుమార్. 

ఇకపోతే, తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వారు ఆశిస్తున్న ఆకాంక్షను నెరవేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమల్ హాసన్ స్పష్టం చేశారు. అవసమైతే రాబోయే ఎన్నికల్లో తన చిరకాల మిత్రుడు రజనీకాంత్ తో కలిసి పనిచేస్తామని కూడా ప్రకటించారు. 

 
కమల్ హాసన్ వ్యాఖ్యలపై స్పందించారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ అనుకున్నది సాధిస్తారని తెలిపారు. 2021 ఎన్నికల్లో అద్భుతాలు సృష్టిస్తామని స్పష్టం చేశారు.   

ఎన్నికల్లో పోటీ చేసే అంశం, కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీతో పొత్తు అనే అంశాలు ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని తెలిపారు. అదే సమయంలో చీఫ్ మినిస్టర్ ఎవరు అనేదానిపై కూడా చర్చిస్తామని తెలిపారు.  
 
తాను త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు రజనీకాంత్ స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకులతో చర్చించి, కమల్ హాసన్  పార్టీతో పొత్తు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ఈ వ్యహారమంతా ఎన్నికలకు అతి సమీపంలోనే జరుగుతుందని చెప్పుకొచ్చారు. 

గోవాలో ఐఫా గోల్డెన్ జూబ్లీ ఐకాన్ అవార్డు అందుకున్న అనంతరం చెన్నై ఎయిర్ పోర్ట్  చేరుకున్న రజనీకాంత్ తనకు వచ్చిన అవార్డును తమిళనాడు ప్రజలకు అంకితమిచ్చారు. కమల్ హాసన్ పార్టీతో పొత్తు, ఆయన స్నేహ హస్తంపై మీడియాతో మాట్లాడారు.

2021 ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతాలు చూపిస్తారంటూ తెలిపారు. 2021 ఎన్నికల్లో తన ప్రభావంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రజనీకాంత్. కమల్ హాసన్ అనుకున్నది సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

ఇకపోతే ఇటీవలే తమిళనాడు సీఎం ఎడపాడి పళని స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ పార్టీ పెట్టినా ఎలాంటి ప్రభావం ఉండదంటూ సంచలన వ్యాక్యలు చేశారు. ఒక నటుడు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారంటూ సెటైర్లు వేశారు. కమల్ హాసన్, రజనీకాంత్ ల జోడి పిల్లి ఎలుకల జోడి అంటూ అభివర్ణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios