ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆ పార్టీ ఎంపీ, తన కూతురు అయిన సుప్రియా సూలే, మరో నేత ప్రఫుల్ పటేల్ ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు శరద్ పవార్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ 25వ వార్షికోత్సవంలో ఈ విషయాన్ని ప్రకటించారు. 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కూతురు, ఎంపీ అయిన సుప్రియా సూలేతో పాటు మరో నేత ప్రఫుల్ పటేల్ ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎంపిక చేశారు. పార్టీ 25వ వార్షికోత్సవంలో శరద్ పవార్ ఈ ప్రకటన చేశారు. ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఒడిశా రైలు ప్రమాదం.. బోగీల నుంచి దుర్వాసన వస్తోందని స్థానికుల ఆందోళన.. అధికారులు ఏం చెప్పారంటే ?

ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకు మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, మహిళా యువజన, లోక్సభ సమన్వయ బాధ్యతలను అప్పగించారు. ఆమె ప్రస్తుతం బారామతి నుండి ఎంపీగా 17వ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా రాష్ట్రాలను ప్రఫుల్ పటేల్ చూసుకోనున్నారు.

Scroll to load tweet…

గత నెలలో శరద్ పవర్ తన జాతీయాధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నానని సంచలన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఆయన తన రాజీనామాను శరద్ పవార్ వెనక్కి తీసుకున్నారు. మే 5వ తేదీన ఎన్సీపీ ప్యానెల్ ఆయన రాజీనామాను తిరస్కరించి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరింది.

గాంధీని గాడ్సే చంపినా.. ఈ దేశ కుమారుడే, కానీ ఔరంగజేబులా ఆక్రమణదారుడు కాదు - బీజేపీ నేత గిరిరాజ్ సింగ్

‘‘మీ మనోభావాలను నేను అగౌరవపరచలేను. మీ ప్రేమను, ఎన్సిపి సీనియర్ నాయకులు ఆమోదించిన తీర్మానాన్ని నేను గౌరవిస్తున్నాను. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాను.’’ అని ఆ సమయంలో పవార్ వెల్లడించారు