Asianet News TeluguAsianet News Telugu

కుండలో నీళ్లు తాగాడని దళిత విద్యార్థిని కొట్టిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు..

రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఓ దళిత విద్యార్థి కుండలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించాడని అతడిని టీచర్ కొట్టాడు. దీంతో బాలుడు చెవికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం చనిపోయాడు. 

The teacher who beat the Dalit student for drinking water from the pot.. The boy died while receiving treatment..
Author
First Published Aug 14, 2022, 9:43 AM IST

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ మ‌న సమాజం అంటరానితనం నుంచి ఇంకా విముక్తి పొంద‌లేదు. ప‌లు సంద‌ర్భాల్లో ద‌ళితుల‌పై, నిమ్న వ‌ర్గాల‌పై దాడులు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా రాజ‌స్థాన్ లో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. కుండ‌లో నీళ్లు తాగాడ‌ని ఓ ద‌ళిత విద్యార్థిని టీచ‌ర్ చిత‌క‌బాదాడు. దీంతో ఆ పిల్లాడు చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు.

Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ బిగ్ బుల్‌ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూత

ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. జలోర్ జిల్లాలోని సైలా సబ్ డివిజన్ ప్రాంతంలోని సురానా గ్రామానికి చెందిన 9 ఏళ్ల ద‌ళిత బాలుడు అదే గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చ‌దువుతున్నాడు. అయితే జూలై 20వ తేదీన ఆ బాలుడు స్కూల్ ఓ ఉన్న స‌మ‌యంలో నీళ్లు తాగేందుకు కుండ‌ను తాకాడు. దీంతో ఆ స్కూల్ టీచ‌ర్ చైల్ సింగ్ (40)ని తీవ్రంగా కొట్టాడు. దీంతో అత‌డి చెవిలోని సిర ప‌గిలిపోయింది. దీంతో వెంట‌నే ఆ పిల్లాడిని చికిత్స కోసం ఉదయ్ పూర్ కు తీసుకెళ్లారు. అక్క‌డి నుంచి మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్ కు పంపించారు. కాగా అప్ప‌టి నుంచి అక్క‌డే చికిత్స పొందుతున్న బాలుడు శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించాడు. 

Independence Day: తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ముర్ము.. ఏం మాట్లాడ‌నున్నారో?

ఈ ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. నిందితుడి చైల్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. హ‌త్య‌,  ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం సెక్షన్ల కింద కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇది బాధాక‌ర‌మని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ‘‘ జాలోర్‌లోని సైలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడి దాడి కారణంగా విద్యార్థి మృతి చెందడం బాధాకరం. నిందితుడిపై హత్య, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.’’ అని తెలిపారు. బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మృతుల బంధువులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల చొప్పున అందజేయనున్నారు. 

కాగా ఈ కేసును విచారించే బాధ్యతను జలోర్ చీఫ్ ఆఫీసర్ (CO)కు అప్పగించినట్లు జలోర్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ట్విట్ట‌ర్ లో వారు స్పందిస్తూ.. ‘‘ సైలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన ఈ కేసును జ‌లోర్ సీవో ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ, CO లు ఘటనా స్థలానికి చేరుకుని ప‌రిస్థితిని ప‌రిశీలించారు. శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులోనే ఉన్నాయి ’’ అని అన్నారు. 

KARNATAKA: కోర్టులో దారుణం.. క‌ట్టుకున్న‌ భార్య గొంతు కోసి దారుణ హత్య

అయితే ఈ ఘటనపై రాష్ట్ర విద్యా శాఖ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారిని కోరింది. బాధిత కుటుంబాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ ఖిలాడీ లాల్ బైర్వా ఆగస్టు 15వ తేదీన క‌ల‌వ‌నున్నారు. బీజేపీ ఎంపీ దియాకుమారి ఈ ఘ‌ట‌న‌పై మాట్లాడుతూ.. ఇది చాలా విచారకరం అని అన్నారు. రాజస్థాన్  లో కాంగ్రెస్ పాలనలో విద్యాల‌యం కుల వివక్ష, దౌర్జన్యార్జలకు కేంద్రంగా మారింది. కేవ‌లం కుండ‌లో నీళ్లు తాగినందుకు బాలుడు టీచ‌ర్ దాడి వ‌ల్ల చ‌నిపోయాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయని ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios