ఓ కుమారుడు కసాయిగా మారాడు. కన్న తల్లిదండ్రులను దారుణంగా చంపేశాడు. హోటల్ తన పేరు మీద మార్చనందుకు ఈ కర్కశానికి ఒడిగట్టాడు. హర్యానాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హోటల్ ను తన పేరు మీద రాసివ్వనందుకు తల్లిదండ్రులను ఓ కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. గదిలో తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో కుమారుడు వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
కోడిపుంజుకి దశదినకర్మలు, 500మందికి భోజనాలు.. దాని త్యాగం మరవలేమంటూ కన్నీరు.. ఎక్కడంటే..
వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని ఝజ్జర్ రోడ్‌లోని 18వ చంద్రభాన్ (58) కు ఓ హోటల్ ఉంది. అతడికి భార్య, కుమారుడు తరుణ్, కోడలు ఉన్నారు. అయితే ఇటీవల కొంత కాలం నుంచి తరుణ్ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. హోటల్ ను తన పేరుపై రాయాలని డిమాండ్ చేస్తున్నాడు. దీనికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
CJI NV Ramana: మీడియాపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలో శనివారం ఇంట్లో తల్లిదండ్రులు నిద్రిస్తుండగా వారిపై కుమారుడు తరుణ్ ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. బుల్లెట్ల శబ్ధం విని తరుణ్ భార్య కిందకు వచ్చి చూసేసరికి అత్తమామలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులకు సమాచారం అందటంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నారు.
ఇలాంటి ఘటనే ఈ ఏడాది ఫిబ్రవరి లో చోటు చేసుకుంది. బీడీ కోసం ఓ వ్యక్తి కన్న తండ్రిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాంలోని బార్పేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన తండ్రిని బీడీ కావాలని అడిగాడు. అతను వెంటనే కొడుక్కి ఒక బీడీ ఇచ్చాడు. అయితే.. ఒకటి సరిపోదని మరో బీడీ కావాలని అడిగాడు. రెండో బీడీ ఇవ్వడానికి తండ్రి అంగీకరించలేదు. దీంతో.. ఈ విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆవేశంతో సదరు యువకుడు తండ్రిని కిరాతకంగా దాడి చేశాడు.
‘‘బీఫ్ ఎగుమతి ద్వారా మోడీ డబ్బులు సంపాదిస్తారు.. కానీ లోకల్ మాంసం దుకాణాలు మూసేస్తారు’’ - ఓవైసీ
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
