ప్రధాని మోడీ ప్రభుత్వం మాంసం ఎగుమతి చేయడం ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకుంటోందని, కానీ ఇక్కడ లోకల్ గా ఉండే మాంసం దుకాణాలను మూసేస్తుందని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మతపరమైన భావాలు చెప్పి మాంసం దుకాణాలు మూసేస్తున్నా.. వాటి నుంచే లాభాలు పొందడంలో ప్రధానికి ఏ అభ్యంతరమూ లేదని ఆరోపించారు.

కన్వర్ యాత్ర సాగే మార్గంలోని మాంసం దుకాణాలను 27వ తేదీ వ‌ర‌కు మూసివేయాలని ఘజియాబాద్ అడ్మినిస్ట్రేటివ్ ఆదేశించింది. అయితే ఈ విష‌యంలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. త‌మ దేశం నుంచి మాంసం దిగుమతులను తిరిగి ప్రారంభించాలని బంగ్లాదేశ్‌ను భారత ప్రభుత్వం కోరినట్టు వచ్చిన వార్తలను ఆయన ఉద‌హ‌రించారు. మాంసాన్ని ఎగుమ‌తి చేసి భారత దేశం లాభం పొందాల‌ని చూస్తోంద‌ని, అయితే దేశీయంగా మాంసం అమ్మేవారిని మాత్రం అడ్డుకుంటోంద‌ని ఆరోపించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో పోస్ట్ పెట్టారు. “మత భావాల కోసం మాంసం దుకాణాలను మూసివేశారు. అయితే గోష్ట్ నుండి డబ్బులు సంపాదించడానికి మోడీకి ఎలాంటి స‌మ‌స్యా లేదు’’ అని ట్వీట్ చేశారు.

Covid Vaccination in India: క‌రోనా వ్యాక్సినేష‌న్ కు 4 కోట్ల మంది దూరం.. ఒక్క డోస్ కూడా తీసుకోలేదంట‌..

దానికంటే ముందు చేసిన పోస్ట్ లో ‘‘గొడ్డు మాంసం/ బీఫ్‌తో పాటు మాంసం దిగుమతులను పునఃప్రారంభించాలని ఇండియా అభ్యర్థించిందని బంగ్లాదేశ్ మీడియా నివేదించింది. మామూలుగా అయితే సంఘీలు ముస్లిం పశువుల వ్యాపారులపై తరచూ దాడి చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు గొడ్డు మాంసం / బీఫ్‌లను నిషేధిస్తాయి. ఇక్కడున్న కబేళాలను మూసివేస్తాయి. కానీ ప్రభుత్వం పెద్ద వ్యాపారులకు డబ్బు సంపాదించడానికి సహాయం చేయాలనుకుంటుంది. ’’ అని అన్నారు. 

భార్యపై భర్త స్నేహితుడి అత్యాచారం.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

కన్వర్ యాత్ర జూలై 14న ప్రారంభమైంది. జూలై 26న ముగుస్తుంది. అయితే దీని కోసం కన్వర్ యాత్ర మార్గం నుండి 500 మీటర్ల పరిధిలో ఉన్న మాంసం దుకాణాలు, దేవాలయాలు జూలై 18 నుండి జూలై 27 వరకు మూసివేస్తున్న‌ట్టు ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.

Scroll to load tweet…

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2 సంవత్సరాల విరామం తరువాత కన్వర్ యాత్ర జరుగుతోంది, దీని ఫలితంగా ఈ సంవత్సరం భక్తుల ప్రవాహం పెరిగింది. శివభక్తులైన 'కన్వారియాలు' గంగానది ఒడ్డుకు వెళ్లి తమ ఇళ్లలో లేదా ప్రాంతాల్లోని దేవాలయాల్లో సమర్పించడానికి వారు ఇక్క‌డి నుంచి నీటిని తీసుకెళ్తారు. 

బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ : పార్థ ఛటర్జీ ఎవరంటే...

ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో శనివారం (జూలై 23, 2022) ఉదయం మధ్యప్రదేశ్‌కు చెందిన కన్వర్ భక్తుల గుంపుపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన తెల్లవారుజామున 2.15 గంటలకు జరిగింది. గ్వాలియర్ నుండి భక్తులు హరిద్వార్ నుండి వారి ఇంటికి వెళ్తుండగా ఒక ట్రక్కు వారిని ఢీకొట్టింది. గాయ‌ప‌డిన ఒక వ్య‌క్తిని హాస్పిట‌ల్ త‌ర‌లించారు. అయితే అక్క‌డ చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి ఆయ‌న చ‌నిపోయారు. ఘ‌ట‌నా స్థ‌లంలోనే 5 గురు చ‌నిపోయారు.