Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. భార్య‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడ‌ని తండ్రిని గొడ్డ‌లితో న‌రికిన కుమారుడు.. ఎక్క‌డంటే ?

తన మాజీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించి ఓ కుమారుడు 70 ఏళ్ల తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

The son killed the father with an ax for having an illicit relationship with his wife. This incident took place in Madhya Pradesh
Author
First Published Sep 9, 2022, 10:55 AM IST

వివాహేత‌ర సంబంధాలు ఎన్నో అన‌ర్థాల‌కు దారి తీస్తున్నాయి. ప‌చ్చ‌ని కాపురంలో నిప్పులు పోస్తున్నాయి. భార్య భ‌ర్త‌ల మ‌ద్య చిచ్చు పెడుతున్నాయి. అనోన్యంగా సాగిపోతున్న దాంప‌త్య జీవితంలో ఇవి ప్ర‌వేశించి ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ అక్ర‌మ సంబంధాలు ప‌లు సంద‌ర్భాల్లో హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. కన్న తండ్రినే కుమారుడు గొడ్డ‌లితో న‌రికి చంపాడు.

మాన‌వాభివృద్ధి సూచీలో దిగ‌జారిన భార‌త్ ర్యాంక్

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. క‌ట్ని జిల్లా బద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కచారి గ్రామానికి చెందిన 25 ఏళ్ల ల‌క్ష్మ‌ణ్ కుమార్ కు కొంత కాలం కిందట పెళ్లి జ‌రిగింది. అయితే ప‌లు కార‌ణాల‌తో అత‌డు త‌న భార్య నుంచి విడిపోయాడు. ముంబైలో ఉంటున్నాడు. అయితే అత‌డి తండ్రి మాజీ భార్య‌తో అక్ర‌మ సంబంధం క‌లిగి ఉన్నాడ‌ని అనుమానం వ్య‌క్తం చేశాడు. 

చికెన్ వింగ్స్ ఆర్డర్ చేస్తే.. ఎముకలు, లెటర్.. దాంట్లో ఉన్న విషయం చూసి కంగుతిన్న కస్టమర్..

ఈ క్ర‌మంతో గ‌త సోమ‌వారం ల‌క్ష్మ‌ణ్ కుమార్ ముంబై నుంచి త‌న గ్రామానికి తిరిగి వ‌చ్చాడు. త‌న భార్య‌తో తండ్రి నందిలాల్ (70) కు ఉన్న సంబంధంపై మంగ‌ళ‌వారం చ‌ర్చ జ‌రిగింది. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చెల‌రేగింది. ఇది తీవ్ర రూపం దాల్చింది. దీంతో కోపంతో ల‌క్ష‌ణ్ కుమార్ త‌న తండ్రిని గొడ్డ‌లితో న‌రికాడు అని బద్వారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అంకిత్ మిశ్రా తెలిపారు.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కేవలం కేంద్రం బాధ్యత కాదు - నిర్మ‌లా సీతారామ‌న్

తీవ్ర గాయాల‌పాలైన నందిలాల్‌ను మొదట స్థానిక ఆరోగ్య కేంద్రానికి ఆ త‌రువాత కట్నీ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంకా మెరుగైన చికిత్స కోసం అక్క‌డి నుంచి జబల్‌పూర్ లోని ప్రభుత్వ  వైద్య కళాశాలకు త‌ర‌లించారు. కానీ చికిత్స పొందుతున్న స‌మ‌యంలోనే అత‌డు ప‌రిస్థితి విష‌మించి బుధ‌వారం చ‌నిపోయాడు. అయితే నిందితుడు తిరిగి ముంబైకి పారిపోవాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ పోలీసులు అత‌డిని ప‌ట్టుకొని అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios