Asianet News TeluguAsianet News Telugu

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కేవలం కేంద్రం బాధ్యత కాదు - నిర్మ‌లా సీతారామ‌న్

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో రాష్ట్రాలు కూడా తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అది కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉండదని చెప్పారు. 

Controlling inflation is not the sole responsibility of the Center -  Nirmala Sitharaman
Author
First Published Sep 9, 2022, 9:02 AM IST

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కేవలం కేంద్ర ప్ర‌భుత్వ బాధ్యత కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. రాష్ట్రాలు కూడా ఇందులో తమ వంతు పాత్ర పోషించాలని చెప్పారు. ద్రవ్యోల్బణానికి కంటే దేశంలో ఉద్యోగాల సృష్టి, సమానమైన సంపద పంపిణీ, దేశాన్ని వృద్ధి ప‌థంలో న‌డిపించేలా చూడ‌టం వంటి ముఖ్య‌మైన ప్రాధాన్యతలు ఉంటాయని చెప్పారు. ‘‘ వాస్తవానికి కొన్ని రెడ్ లెటర్స్ (ప్రాధాన్యతలు) ఉంటాయి. కొన్ని ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే అదే అర్థంలో చూస్తే ద్రవ్యోల్బణం రెడ్ లెటర్స్ కాక‌పోవ‌చ్చు. ఇది మీలో చాలా మందికి ఆశ్చర్యం కలిగించదని నేను ఆశిస్తున్నాను ’’ అని ఆర్థిక మంత్రి అన్నారు.

ఆమె ఓ లేడీ అర్జున్ రెడ్డి.. ఫుల్లుగా మందేసి వచ్చి స్కూల్ పిల్లలకు పాఠాలు.. టీచర్ సస్పెండ్...

జీఎస్టీ, ఒకే మార్కెట్ ఏర్పాటు, టోల్స్, పన్నుల తొలగింపు, వస్తువుల తరలింపు వంటి అంశాలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న ద్రవ్యోల్బణం రాష్ట్రాన్ని బట్టి మారుతుందని ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ఆధ్వర్యంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై గురువారం జరిగిన సదస్సులో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతిమ వినియోగదారులపై అధిక అంతర్జాతీయ ముడి చమురు ధరల భారాన్ని తగ్గించడానికి కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని రెండుసార్లు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా వ్యవహరించలేదని, రాష్ట్ర స్థాయి పన్నులను తగ్గించాయని ఆమె పేర్కొన్నారు.

From the IAF Vault: ఎవరెస్టు పర్వతం మీదుగా సాగిన తొలి వైమానిక ప్రయాణం.. ఆసక్తికర కథనం

‘‘ యాదృచ్ఛికంగా ఇంధన ధరలను తగ్గించని రాష్ట్రాల్లో జాతీయ స్థాయి ద్రవ్యోల్బణం కంటే అధిక ద్రవ్యోల్బణం ఉందని నేను గుర్తించాను ’’ అని సీతారామన్ అన్నారు. రెండు సందర్భాలలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడానికి (2021 నవంబర్, 2022 మేలో) కేంద్రం తీసుకున్న చర్యను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. 

‘‘ ఈ రోజు మాదిరిగానే పన్ను విధించదగిన ఆదాయాల విభజన గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అలాగే రాష్ట్రాలు కూడా తమ ద్రవ్యోల్బణాన్ని ఎలా నిర్వహిస్తాయి అనే దానిపై ఈ అవగాహన కలిగి ఉండటానికి తగినంత సమర్థనలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం కేంద్ర ద్వారా మాత్రమే కంట్రోల్ లో ఉండ‌దు ” అని సీతారామన్ నొక్కిచెప్పారు.

క‌ర్త‌వ్యప‌థ్‌గా మారిన రాజ్‌‌ప‌థ్‌... నేతాజీ విగ్ర‌హాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

‘‘ భారతదేశం ద్రవ్యోల్బణ నిర్వహణ ‘ద్రవ్యోల్బణాన్ని మచ్చిక చేసుకోవడం’ లేదా దానిని ‘పరిమితిలో ఉంచడం’ అనే పదం, అనేక విభిన్న కార్యకలాపాల అభ్యాసం అని, వీటిలో ఎక్కువ భాగం నేటి పరిస్థితుల్లో ద్రవ్య విధానానికి వెలుపల ఉన్నాయని నేను చెబుతాను ’’ అని సీతారామన్ అన్నారు. ‘‘ రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోనప్పుడు భారతదేశంలోని ఆ భాగం ద్రవ్యోల్బణం ఒత్తిడి నుండి ఉపశమనం పొందలేక బాధపడుతోంది. బాహ్య కారకాలు కేంద్రం, రాష్ట్రాలు రెండింటినీ ప్రభావితం చేస్తాయి ’’ అని సీతారామన్ ఈ సదస్సులో నొక్కిచెప్పారు.

ఇదిలా ఉండగా.. గత నెలలో గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూలైలో అఖిల భారత ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయి 6.71 శాతానికి పడిపోయింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 22 రాష్ట్రాలలో సగం జులైలో ద్రవ్యోల్బణం 6.71 శాతం కంటే ఎక్కువగా ఉంది. అది తెలంగాణలో అత్యధికంగా 8.58 శాతం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios