వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విడిచిన షూ లో ఓ పెద్ద పాము దూరడం, దానిని ఎంతో చాకచక్యంగా బయటకు తీయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

మ‌నం ఇంటి బ‌య‌ట షూస్ విడిచి లోప‌లికి వ‌స్తాం. మ‌ళ్లీ బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు వేసుకొని వెళ్తాం. షూ లోప‌ల ఏముంద‌ని చూసే తీరిక చాలా మందికి ఉండదు. కానీ అందులో ఏ విష స‌ర్ప‌మో దూరి ఉంటే ప‌రిస్థితి ఎలా ఉంటుంది. ? కాలు పెట్టిన‌వెంట‌నే పాము కాటేయ‌డం, మ‌నం త‌రువాత మెళ్ల‌గా తేరుకొని హాస్పిట‌ల్ కు ప‌రిగెత్త‌డం వంటి విష‌యాలు వెంట వెంట‌నే జ‌రిగిపోతాయి. కానీ ఓ వ్య‌క్తి మాత్రం షూ లో దూరిన పామును గ‌మ‌నించాడు. వెంట‌నే దానిని తీసేందుకు శిక్ష‌ణ పొందిన సిబ్బందిని పిలిచాడు. దానిని బ‌య‌ట‌కు తీసే స‌మ‌యంలో వీడియో తీశాడు. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 

గుజ‌రాత్ లో దంచికొడుతున్న వాన‌లు.. ఆస్ప‌త్రిని ముంచెత్తిన వ‌ర‌ద‌.. 8 మంది మృతి

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘వర్షాకాలంలో విచిత్రమైన ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. శిక్షణ పొందిన సిబ్బంది సహాయం తీసుకోండి” అని ఆయ‌న క్యాప్ష‌న్ పెట్టారు. 

Scroll to load tweet…

ఈ చిన్న క్లిప్ లో ఓ మ‌హిళ పామును ప‌ట్టుకోవ‌డానిక చేసిన ప్ర‌య‌త్నాలు క‌నిపిస్తాయి. ముందుగా పామును పట్టే ఓ రాడ్ ను తీసుకొని షూ లోపలకి నెట్టారు. ఆమె షూ లోపల ఇనుప రాడ్‌ను ఉంచగా పాము దాని నుండి బయటకు వచ్చింది. ఆ స‌మ‌యంలో పాము మహిళపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ఆ పాము విష‌యంలో జాగ్రత్తతో ఉంటుంది. చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి చివ‌రికి పామును షూ లో నుంచి బ‌య‌ట‌కు తీస్తుంది. 

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మళ్లీ షురు.. జమ్మూ బేస్ క్యాంపు నుంచి 7000 మంది పయనం

షూ ధరించే ముందు దుమ్ము దులపడం ఎందుకు అవసరమో ఆమె వివ‌రించారు. ముఖ్యంగా వర్షాకాలంలో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అని ఆమె తెలిపారు. ఈ వీడియో క్లిప్ ను షేర్ చేసిన నాటి నుంచి 101,000 కంటే ఎక్కువ వ్యూవ్స్ వ‌చ్చాయి. 3,400 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. కామెంట్ సెక్షన్‌లలో చాలా మంది అభిప్రాయాల‌ను పంచుకున్నారు. కొంద‌రు ఈ వీడియోను భయంకరమైనది అని అభివ‌ర్ణిస్తుండగా.. మ‌రి కొంద‌రు ఈ స‌మాచారాన్ని షేర్ చేసినందుకు IFS అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.‘‘ సమాజం కోసం గొప్ప సున్నితత్వ వీడియోలు’’ అని ఒకరు రాయగా.. ‘‘మీరు పంపించిన ఈ రకమైన సమాచారానికి ధన్యవాదాలు’’ అని మరొకరు పేర్కొన్నారు. 

ఇదిలా వుండగా.. గత నెలలో కేరళలోని ఓ పాఠ‌శాల‌లో నాలుగో తరగతి విద్యార్థిని విషపూరిత పాము క‌రిచిన విషయం తెలిసిందే. ఆ బాలుడిని తన తరగతి గదికి కేవ‌లం 200 మీటర్ల దూరంలోనే కాటేసింది. దీంతో ఆ పిల్లాడిని హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. అ బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని ఆ తర్వాత వార్తలు వచ్చాయి.