ఢిల్లీలో ముగ్గురు ట్రక్కు డ్రైవర్లు లిక్కర్ తాగుతూ రాజకీయాలు మాట్లాడుకున్నారు. రాజకీయాల విషయంలో బేధాభిప్రాయంతో ఇద్దరు వాదులాడుకున్నారు. అనంతరం, ఘర్షణగా మారింది. ఇందులో ఒకరు మరణించారు.
న్యూఢిల్లీ: రాజకీయాలు మాట్లాడుకుంటూ ఇద్దరు తీవ్ర వాగ్వాదం చేసుకున్నారు. ఆ వాగ్వాదం దాడికి దారి తీసింది. ఘర్షణలో ఒకరు మరణించారు. ఈ ఘటన ఢిల్లీలోని ఓక్లా ఏరియాలో చోటుచేసుకుంది.
గౌరవ్ గూడ్స్ క్యారియర్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రభు నాథ్, వికాస్ చౌహాన్, నితిన్‌లు డ్రైవర్‌లుగా పని చేస్తున్నారు. వారి ట్రక్కుల వద్దే ఆదివారం రాత్రి కూర్చొని లిక్కర్ తాగారు. ఈ తాగుతున్న సమయంలో వారు రాజకీయాలు మాట్లాడుకున్నారు. ఈ రాజకీయల విషయాల్లోనే ప్రభు నాథ్‌కు వికాస్ చౌహాన్‌కు తీవ్ర విభేదాలు వచ్చాయి. ప్రభు నాథ్‌ను వికాస్ చౌహాన్ వెనక్కి నెట్టేశాడు. ప్రభు నాథ్ కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఒకరు 112కు డయల్ చేసి ప్రభును ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే ప్రభు నాథ్ మరణించినట్టు వైద్యులు చెప్పారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
రాత్రి 10.57 గంటలకు పోలీసులకు ఫోన్ వెళ్లింది. వెంటనే హెడ్ కానిస్టేబుల్ వినోద్ స్పాట్‌కు చేరాడు. అక్కడ ప్రభు నాథ్, వికాస్ చౌహాన్‌కు మధ్య గొడవ జరిగినట్టు తెలిసిందని డీసీపీ రాజేశ్ దేవ్ తెలిపారు.
Also Read: ఈ సారి వర్షాలు తక్కువే.. ఆ ప్రాంతాల్లో రిస్క్ ఎక్కువ.. ప్రైవేట్ సంస్థ స్కైమెట్ అంచనా ఇదే
గాయపడ్డ ప్రభు నాథ్‌ను తొలుత ఓ హాస్పిటల్ తరలించారు. సోమవారం తెల్లవారుజామున 3.48 గంటలకు ఎయిమ్స్ అధికారులు పోలీసులకు ప్రభు నాథ్ చనిపోయాడని వివరించారు.
బాడీని మార్చురీలో ఉంచారని డీసీపీ తెలిపారు. 302 సెక్షన్ కింద కేసు ఫైల్ చేశామని వివరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపులు మొదలు పెట్టామని పేర్కొన్నారు.
