ముంబైకి చెందిన భరత్ జైన్ ప్రపంచంలోనే అంత్యంత ధనవంతుడైన భిచ్చగాడిగా గుర్తింపు పొందాడు. ఆయన కుటుంబం ఓ ఖరీదైన డూప్లెక్స్ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. కుమారులిద్దరూ కాన్వెంట్ లో విద్యను పూర్తి చేశారు. నెలకు రూ.30 వేల అద్దె తెచ్చే రెండు షాప్ లు కూడా ఉన్నాయి. 

మనం రోజూ ఎంతో మంది బిచ్చగాళ్లను చూస్తుంటాం. ప్రయాణం సమయంలో గానీ, ఆలయాలకు వెళ్లినప్పుడు గానీ అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు. వారి చూస్తే ఎంతో జాలేస్తుంది. పాపం నిరుపేదలు అనుకుంటూ డబ్బు, ఆహారం అందిస్తుంటాం. ఇలా పొట్టకూటి కోసమే ఇలా బిచ్చగాళ్లుగా మారిన వారు కొందరుంటే.. ఈ యాచక వృత్తినే లాభదాయకమైనదిగా భావించి కోటీశ్వరులైనవారు కూడా చాలా మందే ఉన్నారు. వీరిలో కొందరికి ఖరీదైన ఫ్లాట్లు, కార్లు, నెల నెల రెంట్లు వచ్చే స్థిర ఆస్తులు ఉన్నాయంటే నమ్ముతారా ? లేదు కదూ.. కానీ ఈ ఆర్టికల్ చదివిన తరువాత మీరు ఖచ్చితంగా నమ్ముతారు.

లైంగిక వేధింపుల కేసు.. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కు ఢిల్లీ కోర్టు సమన్లు

ఇటీవల ‘ఎకనామిక్స్ టైమ్స్’ ఓ నివేదిక విడుదల చేసింది. అందులో ప్రపంచంలోనే అంత్యంత ధనికుడైన ఓ యాచకుడి గురించి ప్రస్తావించింది. ఆయన పేరు భరత్ జైన్. జైన్ ఎక్కడో విదేశాల్లో జీవించే వ్యక్తి కాదు.. మన భారతదేశ ఆర్థిక రాజధానిగా భావించే ముంబైలోనే ఉంటాడు. ఇప్పటికీ ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించే జైన్ ను అత్యంత సంపన్న బిచ్చగాడుగా ‘ఎకనామిక్స్ టైమ్స్’ గుర్తించింది. 

Scroll to load tweet…

ఇక జైన్ సంపాదన, విద్య, కుటుంబం, ఆస్తులల విషయానికి వస్తే.. ఆయన చిన్నప్పటి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో చదువును కొనసాగించలేకపోయాడు. ఆయనకు పెళ్లయ్యింది. భార్య, ఇద్దరు కుమారులు, సోదరుడు, తండ్రి ఉన్నారు. వీరంతా పరేల్ లోని 1బీహెచ్ కే డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ లో కలిసి నివసిస్తున్నారు. 

ప్రధానిపై అసభ్య పదజాలం ఉపయోగించినంత మాత్రాన దేశద్రోహం కాదు - కర్ణాటక హైకోర్టు

భరత్ జైన్ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువు పూర్తి చేశారు. ఆయన నెలకు అక్షరాల రూ.75,000 సంపాదిస్తున్నాడు. ఆయనకు ముంబైలో రూ.70,00,000 విలువైన రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి. మొత్తంగా జైన్ నికర ఆస్తుల విలువ రూ.7.5 కోట్లు. థానేలో నెలకు రూ.30,000 అద్దెకు ఇచ్చే రెండు దుకాణాలు కూడా ఉన్నాయి.

ఓ సారి క్రిమినల్ ను కాపాడిన డాక్టర్.. గుర్తుంచుకొని మరీ హత్య కుట్రపై అలెర్ట్ చేసిన కాంట్రాక్ట్ కిల్లర్..

ఇంత సంపాదించినా.. ఇన్ని ఆస్తులు ఉన్నా భరత్ జైన్ మాత్రం భిక్షాటన మానలేదు. ఇప్పటికీ యాచక వృత్తిని కొనసాగిస్తున్నాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ (సీఎస్ఎంటీ) లేదా ఆజాద్ మైదాన్ వంటి ప్రముఖ ప్రదేశాలలో జైన్ భిక్షాటన చేస్తుంటాడని ‘హిందుస్తాన్ టైమ్స్’ నివేదించింది. అయితే ఆయన కుటుంబం భిక్షాటన మానేయాలని తరచూ చెబుతున్నప్పటకీ.. వారి సలహాను ఆయన పట్టించుకోవడం లేదంట. చాలా మంది రోజు కు 12-14 గంటలు పనిచేసినా.. వందల రూపాయలు కూడా సంపాదించలేని నేటి పరిస్థితుల్లో.. జైన్ 10-12 గంటలు కష్టపడుతూ ఏకంగా ప్రతిరోజూ రూ.2000-2500 సంపాదిస్తున్నాడు.