గతంలో తన ప్రాణాాలను కాపాడిన డాక్టర్ కు ఓ క్రిమినల్ ఉపకారం చేశాడు. మిమ్మల్ని చంపాలని తనకు సుఫారీ వచ్చిందని ఆ డాక్టర్ కే ఫోన్ చేసి చెప్పాడు. దీంతో డాక్టర్ అప్రమత్తమై, వెంటనే పోలీసులను ఆశ్రయించారు. 

కొన్ని సార్లు సినిమాలో చూపించిన సన్నివేశాలు నిజంగానే మన నిత్య జీవితంలో జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ డాక్టర్ విషయంలోనూ అదే జరిగింది. గతంలో ఓ క్రిమినల్ కు ఆయన వైద్యం చేశారు. దీనిని గుర్తుంచుకొని కొంత కాలం తరువాత కృతజ్ఞతగా ఆ క్రిమినల్ డాక్టర్ ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు పట్ల అప్రమత్తం చేశాడు. అచ్చం సినిమాలో చూపించిన విధంగా జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.

క్రమశిక్షణ పేరుతో 15 మంది బాలికల జుట్టు కత్తిరించిన టీచర్.. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఏం చేశారంటే ?

వివరాలు ఇలా ఉన్నాయి. షాజహాన్ పూర్ జిల్లా బ్రిజ్ విహార్ కాలనీలో సోమ్ శేఖర్ దీక్షిత్ అనే డాక్టర్ ఓ హాస్పిటల్ ను నడుపుతున్నాడు. కొంత కాలం కిందట ఆ హాస్పిటల్ కు రాజన్ శర్మ అనే ప్రొఫెషనల్ కిల్లర్ ప్రాణాపాయ స్థితిలో వచ్చాడు. అతడికి శేఖర్ ట్రీమ్ మెంట్ అందించాడు. ప్రాణాలను రక్షించాడు. అనంతరం నేరస్తుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

కొంత కాలం తరువాత ఆ ప్రొఫెషనల్ కిల్లర్ కు ఓ సుఫారీ అందింది. డాక్టర్ సోమ్ శేఖర్ దీక్షిత్ ను చంపాలని పలువురు ఆయనకు రూ.80 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారు. తన ప్రొఫెషనల్ లో భాగంగా అతడు ఆ సుఫారీని తీసుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ మొత్తంలో సగాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకున్నాడు. అడ్వాన్స్ అయితే తీసుకున్నాడు కానీ డాక్టర్ హత్య చేయడానికి అతడికి మనసు ఒప్పలేదు. గతంలో డాక్టర్ వల్ల పొందిన సాయం అతడికి గుర్తొచ్చింది.

స్థలం కబ్జా చేశారని తండ్రి ఫిర్యాదు, కూతురిపై వేధింపులు.. పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితురాలి ఆత్మహత్య..

ఈ హత్య విషయంలో డాక్టర్ ను అప్రమత్తం చేయాలని రాజన్ శర్మ భావించాడు. అందులో భాగంగా ఈ వారం ప్రారంభంలో ఓ 18 ఏళ్ల యువకుడిని సోమ్ శేఖర్ దీక్షిత్ వద్దకు పంపించాడు. ఆ యువకుడు డాక్టర్ కు ఫోన్ ఇచ్చి.. రాజన్ శర్మతో మాట్లాడాలని సూచించాడు. దీంతో ఆ క్రిమినల్ జరిగిన విషయం అంతా చెప్పాడు. మీ ద్వారా గతంలో తాను సాయం పొందానని కూడా ఫోన్ లో డాక్టర్ కు గుర్తు చేశాడు. అందుకే తాను ఈ విషయంలో అప్రమత్తం చేయాలని కాల్ చేసినట్టు వివరించాడు. 

పోలీసులకు సమాచారం ఇవ్వకుండా లక్నో లేదా ఢిల్లీలో తనను కలవాలని అతడు డాక్టర్ శేఖర్ కు సూచించాడు. తనపై నమోదైన క్రిమినల్ కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరాడు. దీంతో డాక్టర్ ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాడు. తన హత్యకు ఎవరు సుఫారీ ఇచ్చారని ఆందోళన చెందుతూ వెంటనే పోలీసులను సంప్రదించాడు.

ఐక్యంగా పోరాడి బీఆర్ఎస్ ను గద్దె దింపుతాం - కిషన్ రెడ్డి, బండి సంజయ్

డాక్టర్ ఫిర్యాదు మేరకు షాజహాన్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో రాజన్ శర్మ (ప్రొఫెషనల్ కిల్లర్) అనే వ్యక్తి, ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర), 507 (ఫోన్ ద్వారా బెదిరించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ముప్పు పొంచి ఉండటంతో వైద్యుడికి భద్రత కల్పించినట్లు షాజహాన్ పూర్ ఏఎస్పీ (సిటీ) సుధీర్ జైస్వాల్ శుక్రవారం తెలిపారు.