Asianet News TeluguAsianet News Telugu

రేపు ‘రోజ్ గార్ మేళా’ డ్రైవ్ ను ప్రారంభించినున్న ప్రధాని.. 75 వేల మందికి జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందజేత

ప్రధాని నరేంద్ర మోడీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్ గార్ మేళా డ్రైవ్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 75 వేల మందికి జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందజేయనున్నారు. 

The Prime Minister is launching the 'Rose Gar Mela' scheme tomorrow. He will give job appointment letters to 75 thousand people.
Author
First Published Oct 21, 2022, 6:17 AM IST

10 లక్షల మందిని రిక్రూట్ చేసుకునేందుకు ఉద్దేశించిన 'రోజ్‌గార్ మేళా' కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ వేడుకల్లో ఉదయం 11 గంటలకు 75,000 మంది అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందజేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం గురువారం వెల్లడించింది.

కోల్‌కతాలో ఉద్రిక్తత.. అర్ధరాత్రి వరకు టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థుల ఆందోళన.. 144 సెక్షన్ విధింపు..

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, పౌరుల సంక్షేమానికి భరోసా కల్పించేందుకు ప్రధాని చేస్తున్న నిరంతర నిబద్ధతను నెరవేర్చేందుకు ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పీఎంవో తన ప్రకటనలో పేర్కొంది. జూన్‌లో ప్రధాని మోడీ ఆదేశాల మేరకు, అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ‘మిషన్ మోడ్’లో మంజూరైన పోస్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి కృషి చేస్తున్నాయని పీఎంవో తెలిపింది. 

దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్త ఉద్యోగులు భారత ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. కొత్తగా నియామకం అయ్యే అభ్యర్తులు గ్రూప్ ఏ, బీ (గెజిటెడ్), గ్రూప్ బీ (నాన్ గెజిటెడ్), గ్రూప్ సీలలో వివిధ స్థాయిలలో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరతారు. నియామకాలు జరుగుతున్న పోస్టులలో కేంద్ర సాయుధ దళ సిబ్బంది, సబ్-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎల్‌డీసీ, స్టెనో, పీఏ, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, ఎంటీఎస్‌లు ఇతర వాటిలో ఉన్నాయి. వచ్చే 18 నెలల్లో ప్రభుత్వం ఈ ఖాళీ పోస్టులన్నీ భర్తీ కానున్నాయి. 

ఘోరం.. పెళ్లి సాకుతో మహిళపై సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పదే పదే అత్యాచారం.. ఎక్కడంటే ?

ఈ ఉద్యోగులను మంత్రిత్వ శాఖలు, విభాగాలు స్వయంగా లేదా యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వంటి రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటాయి. వేగవంతమైన నియాకమం కోసం ఎంపిక ప్రక్రియలు సరళీకృతం అయ్యాయని పీఎంవో తెలిపింది.

కాదా.. పలువురు కేంద్రమంత్రులు ఈ రోజ్ గార్ మేళాలలో పాల్గొననున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఒడిశా, మన్‌సుఖ్‌ మాండవియా గుజరాత్‌, అనురాగ్‌ ఠాకూర్‌ చండీగఢ్‌, పీయూష్‌ గోయల్‌ మహారాష్ట్రలో చేరనున్నారు. ఇతర మంత్రులు కూడా వివిధ నగరాల్లో ఉంటారు. ఎంపీలందరూ తమ పార్లమెంటరీ నియోజకవర్గ యువతలో అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందించబోతున్నారు.

ఇదేనా ప్రధాని మహిళలకు ఇచ్చే గౌరవం - బిల్కిస్ బాను కేసు దోషుల విడుదలపై మోడీపై ఖర్గే మండిపాటు

ఇదిలా ఉండగా.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ప్రకారం.. ఎనిమిదేళ్లలో 7.22 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించినప్పటికీ మార్చి 1, 2020 నాటికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  అయితే వాటిని భర్తీ చేయడానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో రక్షణ మంత్రి, హోం మంత్రి, రైల్వే మంత్రితో సహా ఐదుగురు మంత్రులు ఉన్నారు. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 78,264 ఉద్యోగాలు ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios