Asianet News TeluguAsianet News Telugu

కోల్‌కతాలో ఉద్రిక్తత.. అర్ధరాత్రి వరకు టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థుల ఆందోళన.. 144 సెక్షన్ విధింపు..

తమకు న్యాయం కావాలంటూ పశ్చిమ బెంగాల్ లో 2014 టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు బల ప్రయోగం చేసి నిరసనకారులను చెదరగొట్టారు. చివరికి ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు. 

Tension in Kolkata.. TET qualified candidates protest till midnight.. Imposition of Section 144..
Author
First Published Oct 21, 2022, 4:59 AM IST

కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయం వద్ద టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులు చేస్తున్న నిరసనలు గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 500 వందల మంది నిరసనకారులను అక్కడి నుంచి పోలీసులు చెదరగొట్టారు. అలాగే పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఘోరం.. పెళ్లి సాకుతో మహిళపై సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పదే పదే అత్యాచారం.. ఎక్కడంటే ?

తాము 2014లో టెట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యామని, అయితే మెరిట్ జాబితా నుంచి తొలగించారనని నిరసనకారులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే నిరసనకారులు ఆందోళన విరిమించి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. కానీ తమకు ప్రభుత్వ, రాష్ట్ర-సహాయక ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇస్తేనే నిరసనలు విరమిస్తామని అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ౌ

ఇదేనా ప్రధాని మహిళలకు ఇచ్చే గౌరవం - బిల్కిస్ బాను కేసు దోషుల విడుదలపై మోడీపై ఖర్గే మండిపాటు

గుంపును చెదరగొట్టేందుకు బల ప్రయోగం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైడ్రామా నెలకొంది. ఎట్టకేలకు 12.35 గంటలకు ఆ ప్రాంతం నుంచి నిరసనకారులను పోలీసులు క్లియర్ చేశారు. అయితే పోలీసులు తమను భౌతికంగా హింసించారని ఆందోళనకారులు ఆరోపించారు. ‘‘మమ్మల్ని పోలీసులు ఈడ్చుకెళ్లి మూడు వెయిటింగ్ వాహనాల్లో పడేశారు. మహిళలలు కూడా శారీరకంగా హింసించబడ్డారు ’’ అని అని షీలా దాస్ అనే నిరసనకారుడు తెలిపారని ‘పీటీఐ’ నివేదించింది. 

ఈ ఘటనను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖండించింది. ఆందోళనకారులను పోలీసులు కొట్టారని బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. ‘‘సంధ్యా సమయంలో మహిళలతో పాటు యువ నిరసనకారులను పోలీసులు కొట్టారు. మేము దీనిని సహించబోము. అక్టోబర్ 21న పోలీసుల చర్యకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయి’’ అని ‘పీటీఐ’కి బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ తెలిపారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా ఆయన మండిపడ్డారు. 2014, తదుపరి పరీక్షలలో అర్హత సాధించిన దాదాపు 20,000 మంది టెట్ అభ్యర్థులను నేరుగా నియమిస్తానని బెనర్జీ హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు 6,100 పోస్టులను మాత్రమే ఎందుకు భర్తీ చేశారని ఆమె అన్నారు.

కాగా.. తమకు న్యాయం చేయాలంటూ టెట్ అభ్యర్థులు అక్టోబరు 17 నుంచి ఆందోళన చేపడుతున్నారు. శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. దీనిని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్షుడు గౌతమ్ పాల్ కోరారు. అయితే అభ్యర్థులు దానికి సమ్మతించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios