Asianet News TeluguAsianet News Telugu

రక్తపు మడుగులో చూశా.. నా గుండె రాయి అయిపోయింది... నిర్భయ తల్లి

 డెత్‌ వారెంట్‌ ప్రకటనకు ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ తల్లి కోర్టు హాల్లోకి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది. తన బిడ్డపై కరుణ చూపాలని న్యాయమూర్తిని ఆమె కోరింది. అనంతరం నిర్భయ తల్లి వద్దకు వెళ్లి తన కొడుకుపై దయ చూపాలని అభ్యర్థించింది. అయితే ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

"Cried So Much, I'm A Stone": Nirbhaya Mother On Convict's Mother's Plea
Author
Hyderabad, First Published Jan 9, 2020, 10:32 AM IST

దాదాపు గత ఏడు సంవత్సరాలుగా తాను న్యాయపోరాటం చేస్తున్నానని నిర్భయ తల్లి పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ అనే యువతిపై  ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 రోజులపాటు ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తర్వాత కన్నుమూసింది. 

తాజాగా... ఈ ఘటనలో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించారు. ఈ నెలల 22వ తేదీన వారిని ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో... నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడారు. తన కుమార్తెను అత్యంత పాశవికంగా హతమార్చిన మృగాళ్లను తాను ఎలా క్షమిస్తానని ఆమె ప్రశ్నించారు. వాళ్లకి కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.

దోషులైన ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. అయితే డెత్‌ వారెంట్‌ ప్రకటనకు ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ తల్లి కోర్టు హాల్లోకి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది. తన బిడ్డపై కరుణ చూపాలని న్యాయమూర్తిని ఆమె కోరింది. అనంతరం నిర్భయ తల్లి వద్దకు వెళ్లి తన కొడుకుపై దయ చూపాలని అభ్యర్థించింది. అయితే ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

AlsoRead న్యాయ విద్యార్థినిపై అత్యాచారం... కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడంతో...

ఈ విషయం గురించి ఆమె తాజాగా స్పందించారు. ఏడేళ్ల క్రితం తాము తమ కూతురిని కోల్పోయామని చెప్పారు. రక్తపు మడుగులో తన కుమార్తె శవాన్ని చూశానని చెప్పారు. తన కుమార్తె శరీరంపై ఉన్న గాయాలను చూస్తే.... ఏదైనా క్రూర మృగం దాడి చేసిందా అన్నట్లు ఉన్నాయని గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి తన కళ్ల వెంట రక్తం కన్నీరులా కారుతోందని చెప్పారు. ఏడ్చి ఏడ్చి తన గుండె రాయిలా మారిపోయిందని ఆమె వాపోయారు.

అత్యంత దారుణ పరిస్థితుల్లో నా కూతురిని చూసి... రోజూ చస్తూ బతుకుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నా దగ్గరకు వచ్చి దయ చూపమని ఏడ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని వివరించారు. ప్రస్తుతం తనలో ఎలాంటి బావోద్వేగాలు లేవని చెప్పారు. 

  Also Read:  న్యాయ విద్యార్థినిపై అత్యాచారం

కాగా 2012 డిసెంబర్‌ 16 అర్ధరాత్రి కదులుతున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి మరీ ఆరుగురు అత్యాచారం జరిపారు. నిర్భయ, ఆమె స్నేహితుడిని ఇనుప రాడ్లతో చితకబాదారు. సింగపూర్‌ మౌంట్‌ ఎలిజెబెత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ డిసెంబర్‌ 29న కన్నుమూసింది. ఆరుగురిలో ఒకడైన ప్రధాన నిందితుడు రాంసింగ్‌ తీహార్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్‌ను దోషిగా జువైనల్‌ బోర్డు తేల్చింది. అతడిని జువనైల్‌ హోమ్‌కు తరలించారు. మిగిలిన నలుగురికే ఇప్పుడు ఉరిశిక్ష వేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios