హైదరాబాద్ సంస్థానం చివరి రాజైన ముకర్రం జా టర్కీలో తన 89వ యేట చనిపోయారు. ఆయన కోరిక మేరకు భౌతికకాయాన్ని రేపు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. చౌమహల్లా ప్యాలెస్ ప్యాలెస్ లో సందర్శనార్థం ఉంచనున్నారు. 

హైదరాబాద్‌ చివరి నిజాం, ఉస్మాన్ అలీఖాన్ మనవడు నిజాం మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్ధిఖీ ముకర్రం జా (8వ అసఫ్ జా) టర్కీలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు 89 సంవత్సరాలు. ఆయన కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. యువరాజు ముఖరం జా రాత్రి 10.30 గంటలకు ఇస్తాంబుల్‌లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించింది. 1724లో అధికారంలోకి వచ్చిన నిజాం రాజ వంశంలో ముఖరం జా ఎనిమిదో నిజాం.

కుక్కకు భయపడి ప్రాణ రక్షణ కోసం మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్ మృతి

‘‘హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జహ్ బహదూర్ గత అర్థరాత్రి 10.30 గంటలకు (ఐఎస్టీ) ఇస్తాంబుల్‌లో ప్రశాంతంగా మరణించారు. ఈ విషయం తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాం’’ అని ఆయన కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.

కేంద్రం-ఢిల్లీ స‌ర్కారు మ‌ధ్య మ‌రోసారి భ‌గ్గుమ‌న్న వైరం.. ఎల్జీ భ‌వ‌నానికి ఆప్ ర్యాలీ

స్వదేశంలో అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్ కు తీసుకురానున్నారు. హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. సంప్రదాయబద్ధంగా చేపట్టాల్సిన కర్మలను పూర్తి చేసిన తరువాత అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద ఖననం చేయనున్నారు. 

Scroll to load tweet…

1967 ఏప్రిల్ 6వ తేదీన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ చౌమహల్లా ప్యాలెస్‌లో ముకర్రం జా ను యువరాజుగా ప్రకటించారు. సొంత కుమారులను వదిలేసి తన మనవడిని 8వ నిజాంగా, తన వారసుడిగా ఎంపిక చేశారు. ఫ్రాన్స్‌లో 1933లో ప్రిన్స్ ఆజం జా, యువరాణి దుర్రుషెహ్వార్‌లకు ముకర్రం జా జన్మించారు. హైదరాబాద్ సంస్థానం 1949లో భారతదేశంలో విలీనం అయిన తరువాత రాజ భరణాల కింద ఆయనకు పలు సౌకర్యాలు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను 8వ నిజాంగా గుర్తించింది. అయితే 1971లో రాజ భరణాలను కేంద్రం రద్దు చేసింది.

దేశంలో 40 శాతం సంపద ఒక్కశాతం ధనికులది.. సగం జనాభా దగ్గర ఉన్నది 3 శాతం సంపదే: సంచలన నివేదిక

1977లో పలు కారణాల వల్ల ఆయన హైదరాబాద్ విడిచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ చాలా సంవత్సరాలు గడిపారు. తరువాత టర్కీకి వెళ్లారు. అయితే ఆయనకు ఇప్పటికీ హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముకర్రం జాకు ఆస్తులు ఉన్నాయి.