Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం-ఢిల్లీ స‌ర్కారు మ‌ధ్య మ‌రోసారి భ‌గ్గుమ‌న్న వైరం.. ఎల్జీ భ‌వ‌నానికి ఆప్ ర్యాలీ

New Delhi: రాజకీయ కారణాలతో ఢిల్లీ ప్రభుత్వ పనులను కావాలనే అడ్డుకుంటున్నారని ఆప్ నాయ‌కుడు, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. "మా హోంవర్క్ ను తనిఖీ చేయడానికి ఎల్జీ మా ప్రధానోపాధ్యాయుడు కాదు. ఆయన మా ప్రతిపాదనలకు అవును లేదా కాదు అని చెప్పాలి. ఇలా ర్యాలీకి వేళ్లే ప‌రిస్థితులు రావ‌డం దుర‌దృష్ట‌క‌రం' అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.
 

New Delhi : dispute between the Centre and the Delhi government is deepening. AAP rally at Lieutenant Governor VK Saxena Bhavan
Author
First Published Jan 16, 2023, 2:43 PM IST

Delhi Chief Minister Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ఢిల్లీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన తర్వాత ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఎమ్మెల్యేలు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి మార్చ్ చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ తన తప్పు తెలుసుకుని ఫిన్లాండ్ లో ఉపాధ్యాయుల‌కు శిక్షణకు అనుమతిస్తారని ఆశిస్తున్నాను' అని కేజ్రీవాల్ మీడియాతో అన్నారు. అలాగే, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరని, కానీ ఆయన అలా చేస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ కారణాలతో ఢిల్లీ ప్రభుత్వ పనులను కావాలనే అడ్డుకుంటున్నారని ఆప్ నాయ‌కుడు, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. "మా హోంవర్క్ ను తనిఖీ చేయడానికి ఎల్జీ మా ప్రధానోపాధ్యాయుడు కాదు. ఆయన మా ప్రతిపాదనలకు అవును లేదా కాదు అని చెప్పాలి. ఇలా ర్యాలీకి వేళ్లే ప‌రిస్థితులు రావ‌డం దుర‌దృష్ట‌క‌రం" అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. నిర్ణయాలు తీసుకునే అధికారం లేనప్పుడు ఎన్నికైన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాగా, నేడు ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాలు గంద‌ర‌గోళం మ‌ధ్య వాయిదాప‌డ్డాయి. ఎల్జీ స‌క్సేనా విష‌యాలు, అనవసర అడ్డంకులు, ప్ర‌భుత్వ పాల‌న‌లో జోక్యంపై బీజేపీ ఎమ్మెల్యేలు, అధికార ఆప్ సభ్యుల మధ్య మాటల యుద్ధం చెలరేగడంతో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి.

 

ఢిల్లీ ప్రభుత్వ ఉపాధ్యాయులను ఫిన్లాండ్ కు శిక్షణ కార్యక్రమానికి పంపడానికి లెఫ్టినెంట్ గవర్నర్  అభ్యంతరాలు వ్య‌క్తం చేయ‌డంపై ఆప్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను ఫిన్లాండ్ కు శిక్షణ కోసం పంపాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంలో సక్సేనా జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఒక రోజు వాయిదా పడిన వెంటనే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నివాసానికి ర్యాలీ నిర్వహించారు. అయితే, ప్రాథమిక ఉపాధ్యాయుల శిక్షణ ప్రతిపాదనను తాము తిరస్కరించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఖండించింది. గతంలో ఇటువంటి కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఖర్చు-ప్రయోజన-విశ్లేషణను నమోదు చేయాలని మాత్రమే ప్రభుత్వానికి సూచించింద‌ని పేర్కొంది. 

అయితే, దీనిపై ఢిల్లీ ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. "ఇది ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇది ఢిల్లీ పన్ను చెల్లింపుదారుల సొమ్ము. ఢిల్లీ ప్ర‌జ‌ల పిల్ల‌ల‌ చదువుల కోసం నిర్ణ‌యం తీసుకున్నాం.. ఇందులో ఎల్జీకి ఏ సమస్య ఉంది?' అని ర్యాలీకి ముందు ఆయన మీడియాతో అన్నారు.  కేజ్రీవాల్ సహా ఎమ్మెల్యేలంతా 'మిస్టర్ ఎల్జీ, టీచర్లను ఫిన్లాండ్ వెళ్లడానికి అనుమతించండి' అనే ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలో కనిపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios