జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరుతూ గుప్కర్ కూటమి అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు. ఈ సందర్భంగా వారు ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రస్తావనకు తీసుకొచ్చారు. 

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో ద్వేషానికి జన్మనిచ్చిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ‘‘ జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రతల సమస్యను లేవనెత్తడానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశాం. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం దేశంలో ద్వేషానికి జన్మనిచ్చిందని ఆ సమావేశంలో నేను ఆయనకు చెప్పాను. అలాంటి వాటిని (సినిమాలు) నిషేధించాలి ’’ అని అన్నారు. 

పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ విడుదల తర్వాత లోయలో విద్వేషపూరిత వాతావరణాన్ని నెలకొందని చెప్పారు. జమ్ముకశ్మీర్ ప్రజల మధ్య విభజన పెరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని ఆమె కోరారు. ‘‘కాశ్మీరీ పండిట్లకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించాం. 2010, 2016లో తీవ్ర అశాంతి సమయంలో కూడా ఎలాంటి హత్యలూ జరగలేదు. అయితే కాశ్మీర్ ఫైల్స్ మూవీ కూడా దీనిని ప్రేరేపించింది. వారు నిజమైన సమస్యల నుంచి దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి హిందూ- ముస్లింల మ‌ధ్యను స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నారు.’’ అని ఆమె ఆరోపించారు.

చల్లటి కబురు.. అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

గుప్కర్ కూటమి అధ్యక్షుడు అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం రాజ్ భ‌వ‌న్ లో జ‌మ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలుసుకుంది. ఈ బృందంలో మెహబూబా ముఫ్తీ ఎన్ సీ ఎంపీ హస్నైన్ మసూదీ, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ముజఫర్ షా తదితరులు ఉన్నారు.

కశ్మీర్ పండిట్ ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ ను గత వారం కశ్మీర్ లోని బుద్గాం జిల్లా చదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. భట్ 2010-11 సంవ‌త్సరంలో వలసదారుల కోసం ప్ర‌క‌టించిన ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద క్ల‌ర్క్ గా ఉద్యోగం పొందాడు. 

Supreme Court: జ్ఞానవాపి మసీదుపై పిటిష‌న్ మంగ‌ళ‌వారం విచారించ‌నున్న సుప్రీంకోర్టు !

పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) కూడా కాశ్మీర్ పండిట్ ఉద్యోగులను లోయను విడిచిపెట్టవద్దని కోరింది. ఇది వారి నివాసం అని చెప్పింది. అయితే రాహుల్ భ‌ట్ హ‌త్య త‌రువాత త‌మ‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని ఆ పండిత్ క‌మ్యూనిటీ డిమాండ్ చేసింది. కాగా ఈ హ‌త్య‌పై భారీ నిరసనలు ఏర్పడిన త‌రువాత లోయ ప్రాంతంలో ప‌ని చేస్తున్న పీఎం ప్యాకేజీ ఉద్యోగులంద‌రికీ ఫుల్ సెక్యూరిటీని క‌ల్పించాల‌ని లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ పోలీసులను ఆదేశించారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉండ‌గా.. కాశ్మీరీ పండిట్ రాహుల్ భ‌ట్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను ఆయన స్పష్టంగా ప్రస్తావిస్తూ.. కశ్మీరీ పండిట్ల మారణహోమం కంటే ప్రధానికి సినిమాపై మాట్లాడటం చాలా ముఖ్యమని విమర్శించారు. గత మార్చి నెలలో కశ్మీర్ లోయ నుంచి కాశ్మీరీ హిందువులు సామూహికంగా తరలివెళ్లిన విధానాన్ని చూపిస్తూ తెరకెక్కించిన సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ను మోడీ ప్రశంసించారు.