Asianet News TeluguAsianet News Telugu

‘ది కశ్మీర్ ఫైల్స్‌’పై మరో వివాదం.. మూవీ వల్గర్‌గా ఉన్నదన్న ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్.. ఎవరు ఎలా స్పందించారంటే?

ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మరోసారి వివాదంలో చిక్కింది. గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా చైర్మన్ నడవ్ లపిడ్ ఈ సినిమాను వల్గర్ ప్రాపగాండ మూవీగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. చివరకు ఆ దేశ దౌత్య అధికారి ఆయన తరఫున క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
 

the kashmir files in another controversy vulgar propaganda movie says IFFI jury head, what reactions came afterwards
Author
First Published Nov 29, 2022, 1:17 PM IST

న్యూఢిల్లీ: 1990లో కశ్మీరీ వలసపై, కశ్మీరీ పండిట్‌ల వ్యధలపై ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించారు. ఇందులో వక్రీకరణలు ఉన్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి చాలా వివాదాలు వచ్చాయి. కొందరు తీవ్రంగా వ్యతిరేకించగా.. మరికొందరు దాన్ని సమర్థించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తాజాగా మరో వివాదానికి కేంద్రమైంది. ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్ ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) చైర్మన్ నడవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అటు సినిమా లోకం నుంచి ఇటు రాజకీయరంగంలోనూ కలకలం రేపింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు కార్యక్రమంలో ఇజ్రాయెలీ ఫిలిం మేకర్ నడవ్ లపిడ్.. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా వల్గర్‌గా ఉన్నదని అన్నారు. ఇది దుష్ప్రచారంతో కూడినందని పేర్కొన్నారు. ఈ సినిమాను ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించడంపై జ్యూరి సభ్యులు ఖంగుతిన్నారని వివరించారు. ప్రతిష్టాత్మకైన ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శితమవడానికి ఈ వల్గర్ ప్రాపగాండ మూవీకి అర్హతే లేదని కామెంట్ చేశారు.

Also Read: దేశంలో ద్వేష‌పూరిత వాతావ‌ర‌ణానికి ’ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమానే కారణం - ఫరూక్ అబ్దుల్లా

అంతేకాదు, ఇలా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వేదిక పై మాట్లాడటంపై తనలో సంశయమేమీ లేదని, ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్‌లో భిన్నాభిప్రాయాలు వెలువడటం, వాటిని అంగీకరించడం సాధారణమే అని పేర్కొన్నారు. విమర్శలు అనేది సినిమాలకు, జీవితానికి చాలా అవసరం అని తెలిపారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. చాలా మంది ఆయన మాటల వీడియోను పోస్టు చేసి అందుకు తమ అభిప్రాయాలను జత చేశారు. నడవ్ లపిడ్ వ్యాఖ్యలపైనా మిశ్రమ స్పందన వచ్చింది. పలువురు విమర్శలు కురిపించగా.. ఇంకొందరు విమర్శంచకుండా పరోక్షంగా ఆ వ్యాఖ్యలను సమర్థించినట్టుగా కామెంట్లు చేశారు.

ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆ వీడియోను షేర్ చేసి ఆయన వ్యాఖ్యలను కోట్ చేశారు. ఇంకొందరు అధికారం అండతో వల్గర్‌గా తీసిన ఈ సినిమా అంతర్జాతీయ వేదికపై నవ్వులపాలు చేసిందని విమర్శలు చేశారు.

అలాగే, చాలా మంది నడవ్ లపిడ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ వ్యాఖ్యల అనంతరం ట్విట్టర్‌లో కామెంట్ చేస్తూ.. ‘నిజం అత్యంత ప్రమాదకరమైనది. అది ప్రజలతో అబద్ధాలాడిస్తుంది’ అంటూ పేర్కొన్నారు. సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్ అబద్ధం ఎంత పెద్దదైనా.. సత్యం ముందు చిన్నదే అని కామెంట్ చేశారు. అలాగే, యూదుల జాతి హననం సరైనదే అని భావిస్తే.. కశ్మీరీ పండితుల హననం కూడా సరైనదే అవుతుందని కౌంటర్ ఏఎన్ఐతో అన్నారు.

Also Read: మీడియా నా గొంతు నొక్కేస్తోంది, కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు, అమిత్ షాకు వినతి

కాగా, ఇజ్రాయెల్ అంబాసిడర్ తమ దేశ ఫిలిం మేకర్ నడవ్ లపిడ్ వ్యాఖ్యలను ఖండించారు. భారతీయులు హుందాగా వ్యవహరిస్తూ.. గౌరవ మర్యాదలతో నిన్ను ప్రతిష్టాత్మక ఐఎఫ్ఎఫ్ఐకి ఆహ్వానిస్తే.. ఇలా వారిని అవమానించేలా మాట్లాడటం చాలా బాధించిందని ఓపెన్ లెటర్‌లో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు సరైనవి కావని స్పష్టం చేశారు. తమ హోస్ట్ వ్యాఖ్యలకు తాను క్షమాపణలు చెబుతున్నట్టు ఎన్వయ్ నావోర్ గిలన్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios