Asianet News TeluguAsianet News Telugu

మీడియా నా గొంతు నొక్కేస్తోంది, కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు, అమిత్ షాకు వినతి

ఒక్క సినిమా...ఒకే ఒక్క సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. తనను ఆకాశానికి ఎత్తి గోప్పదర్శకుడిగా చూపించిన అదే మీడియాపై సంచలన వ్యాఖ్యులు చేశారు బాలీవుడ్ డైరెక్టర్. ఇంతకీ ఆయన ఏమన్నారు. 
 

the kashmir files director vivek agnihotri Comments
Author
Hyderabad, First Published May 5, 2022, 5:33 PM IST

ఒక్క సినిమా...ఒకే ఒక్క సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. తనను ఆకాశానికి ఎత్తి గోప్పదర్శకుడిగా చూపించిన అదే మీడియాపై సంచలన వ్యాఖ్యులు చేశారు బాలీవుడ్ డైరెక్టర్. ఇంతకీ ఆయన ఏమన్నారు. 

ది కాశ్మీర్ ఫైల్.... దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపిన సినిమా. ప్రధాని దగ్గర నుంచి బిజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, రాజకీయ సెలబ్రిటీలంతా ఈసినిమా చూసి రాయితీలు ఇచ్చి సంచలనం చేశారు. 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కాశ్మీరీ పండిట్ల పై జరిగిన దాడుల నేపథ్యంలో ఈమూవీ తెరకెక్కింది. 

ఈసినిమా తో పాటు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రీకి కూడా మంచి ఇమేజ్ వచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఆయన హవా నడిచింది. దాంతో అప్పుడప్పుడు కాంట్రవర్సియల్ కామెంట్స్ కూడా చేస్తూ వస్తున్నారు వివేక్. రీసెంట్ గా మరోసారి మరో వివాదానికి తెర తీసారు వివేక్. మీడియాపై నిప్పులు చెరిగారు. 

కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశం దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా తన గొంతును నొక్కేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. 

అగ్నిహోత్రి నేడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇందుకు వేదిక ఇచ్చేందుకు ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ (ఎఫ్‌సీసీ), ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నిరాకరించాయి. దీంతో ఆయన తన వేదికను ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు మార్చుకోవాల్సి వచ్చింది. 

ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేస్తూ.. సమాజంలో వాక్‌ స్వాతంత్ర్యాన్ని కాపాడాల్సిన వారే, తన గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిషేధం అప్రజాస్వామికమని, ఈ విషయంలో అమిత్ షా కలగజేసుకోవాలని కోరారు. తాను దుష్ప్రచార బాధితుడినని అన్నారు. 

అయితే, ఆయన వ్యాఖ్యలను పీసీఐ ఖండించింది. నిబంధనల ప్రకారం నమోదు చేసుకోకుండా వేదికను ఇమ్మంటే ఎలా? అని ప్రశ్నించింది. ఆయన మాటలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఎఫ్‌సీసీ దక్షిణాసియా అధ్యక్షుడు మనీశ్ గుప్తా కూడా దీనిపై స్పందించారు. ఆ ప్రచార కార్యక్రమాన్ని తాము రద్దు చేయాలనుకున్నామని, ఈ విషయంలో ఇంకేం మాట్లాడబోమని స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios