మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. తనతో గొడవ పని పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రావడం లేదని ఆగ్రహించిన భర్త.. తన కుమారుడిని కత్తితో పొడిచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. 

వారిద్దరూ భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంత కాలం కిందట ఈ జంట మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య తన కుమారుడిని భర్త వద్దనే వదిలేసి బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. ఎన్ని సార్లు బతిమిలాడినా తిరిగి ఇంటికి రావడం లేదని విసిగెత్తిపోయిన భర్త కుమారుడిని కత్తితో పొడిచాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో కలకరం రేకెత్తించింది.

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : ట్రాన్స్ జెండర్ బాబీ కిన్నార్ విజయం...

వివరాలు ఇలా ఉన్నాయి. భోపాల్ లోని చోటా ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల వీరూ మాలవీయకు భార్య, ఐదేళ్ల కుమారుడు సందీప్ ఉన్నారు. వీరంతా కలిసి ఛోలాలోని న్యూ మూన్ కాలనీలోని అద్దె ఫ్లాట్ లో నివసిస్తున్నారు. అయితే నాలుగు రోజుల కిందట భార్య భర్తల మధ్య వివాదం తలెత్తింది. దీంతో భార్య తన కుమారుడిని భర్త వద్దనే వదలిపెట్టి పిప్లానీ ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్ళింది.

మీరట్ లో ఘోరం.. తలలేని బాలుడి మృతదేహం లభ్యం.. ఢిల్లీలో బంధువుల ఆందోళన

తిరిగి ఇంటికి రావాలని భార్యను మాలవీయ కోరాడు. కానీ ఆమె వినిపించుకోలేదు. తిరిగి సోమవారం 9.30 నిమిషాల సమయంలో కూడా భార్యకు ఫోన్ చేశాడు. తమ ఇంటికి రావాలని లేకపోతే కుమారుడిని చంపేసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో ఆమె భయపడిపోయింది. కుమారుడిని రక్షించుకునేందుకు పిప్లానీ నుంచి తమ ఇంటికి చేరుకుంది.

కొత్త ఎంపీలకు ఎక్కువ అవకాశం ఇవ్వండి.. వారి బాధ అర్థం చేసుకోండి: రాజకీయ పార్టీలకు మోదీ పిలుపు

కానీ అప్పటికే భర్త ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. కుమారుడి మెడ, వీపుపై కత్తితో తీవ్రమైన గాయాలు కనిపించాయి. వెంటనే బాలుడిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ‘‘ఇటీవల భార్య భర్తల మధ్య ఓ వివాదం తలెత్తింది. దీంతో మాలవీయ భార్య అతడిని విడిచిపెట్టి పిప్లానీ ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్ళింది. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో వీరూ తన భార్యను సంప్రదించి ఇంటికి తిరిగి రావాలని, లేకపోతే తన కుమారుడిని చంపేస్తానని హెచ్చరించాడు. అయితే వీరూ తన కుమారుడిని చంపేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బాలుడు ఎలాగోలా తప్పించుకున్నాడు’’ అని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో నివేదించింది.