Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : ట్రాన్స్ జెండర్ బాబీ కిన్నార్ విజయం...

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓ ట్రాన్స్ జెండర్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. బాబీ కిన్నార్ అనే ట్రాన్స్ జెండర్ సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచింది. 

AAPs transgender candidate Bobi wins from Sultanpuri, delhi
Author
First Published Dec 7, 2022, 1:15 PM IST

ఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ అపురూప ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ట్రాన్స్ జెండర్ ఒకరు విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ట్రాన్స్ జెండర్ అభ్యర్థి- బాబీ కిన్నార్ సుల్తాన్‌పురి-ఏ వార్డు నుండి గెలుపొందినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి జరగుతోంది. 

బోబీ 6,714 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వరుణ ఢాకాను ఓడించారు. తన నియోజకవర్గాన్ని అందంగా తీర్చిదిద్దాలని, పొరుగువారి జీవితాలను మెరుగుపర్చాలని కోరుకుంటున్నట్లు పార్టీ టికెట్ వచ్చిన తరువాత బోబీ చెప్పారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) నుంచి అవినీతిని పారద్రోలేందుకు కృషి చేస్తానని బోబీ చెప్పారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్.. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ, ఆప్ హోరాహోరీ..!

బాబీ కిన్నార్ సామాజిక కార్యకర్త. అన్నా హజారే తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశాడు. 2017లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయాడు.  ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన  మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బాబీ కిన్నార్ కు  టికెట్ ఇచ్చింది. ఓ ట్రాన్స్ జెండర్ అభ్యర్థికి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వడం ఇదే తొలిసారి. కాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందు వరుసలో ఉంది. 

బిజెపి, ఆప్ కు ఎన్నికల లెక్కింపు మొదలైన ప్రారంభంలో హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ .. ప్రస్తుతం ఆప్ ఆధిక్యంలోకి వచ్చింది. స్పష్టమైన మెజారిటీ నీ కనబరుస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 250 వార్డులు ఉన్నాయి. 126 స్థానాలు గెలిచిన పార్టీ మెజారిటీ లో ఉంటుంది.  కాగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికల్లా ఆమ్ ఆద్మీ పార్టీ 86 వార్డుల్లో విజయం సాధించింది. మరో 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.  బిజెపి 70 చోట్ల గెలిచింది. 36 వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. కాగా కాంగ్రెస్ మాత్రం కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మరో ఆరు చోట్ల  ముందంజలో కనిపిస్తుంది. దీంతో ఎన్నికల్లో ఆప్ గెలుపు ఖాయం  అయింది. దీంతో ఆప్ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios