Asianet News TeluguAsianet News Telugu

మీరట్ లో ఘోరం.. తలలేని బాలుడి మృతదేహం లభ్యం.. ఢిల్లీలో బంధువుల ఆందోళన

మీరట్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడి మృతదేహం తలలేకుండా లభించింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. అయితే చనిపోయిన ఆ బాలుడు కొంత కాలం కిందట ఢిల్లీలో కిడ్నాప్ కు గురయ్యాడు. నిందితుడి పోలీసులు పట్టుకున్నారు. అతడిని తమకు అప్పగించాలని బాధిత కుటుంబం ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. 

Meerut horror.. Dead body of headless boy found.. Concerned relatives in Delhi
Author
First Published Dec 7, 2022, 12:59 PM IST

మీరట్ లోని ఇంచోలిలో మూడేళ్ల బాలుడి శరీరంపై కత్తిపోట్లుతో కూడిన , తల లేని మృతదేహం లభించడం కలకరం రేపింది. అయితే ఆ బాలుడు కొంత కాలం కిందట ఢిల్లీలో కనిపించకుండా పోయాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని కత్తితో పొడిచి శవాన్ని పొలంలో పడేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఓ అధికారి తెలిపినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం నివేదించింది. 

వివరాలు ఇలా ఉన్నాయి. నవంబర్ 30వ తేదీన ఢిల్లీలోని ప్రీత్ విహార్ కు చెందిన మూడేళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో స్థానికంగా ఓ మురికివాడలో నివసించే ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ బాలుడిని యూపీలోని మీరట్ కు తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత డిసెంబర్ 4వ తేదీన బాలుడిని దారుణంగా హత్య చేసి ఢిల్లీకి వెళ్లిపోయాడు. దీంతో తమ బిడ్డ కనిపించడం లేదని తల్లిదండ్రులు నవంబర్ 30వ తేదీనే పోలీసులను ఆశ్రయించారు.

కొత్త ఎంపీలకు ఎక్కువ అవకాశం ఇవ్వండి.. వారి బాధ అర్థం చేసుకోండి: రాజకీయ పార్టీలకు మోదీ పిలుపు

కాకా.. మీరట్ లోని ఇంచోలిలోని ప్రాంతంలో ఓ బాలుడి తల లేని మృతదేహం స్థానిక రైతులకు కనిపించింది. అయితే అప్పటికే వీధి కుక్కలు శరీర భాగాలను తిన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. మీరట్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇదే సమయంలో ఢిల్లీ పోలీసు బృందం నిందితుడిని గుర్తించింది. అతడితో ఘటనా స్థలానికి చేరుకుంది. కొన్ని మీటర్ల దూరంలో బాలుడి తలను నిందితుడు పోలీసులకు చూపించాడు. 

అయితే ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బాలుడిపై లైంగిక దాడి జరిగిందా అనే అంశాన్ని పోలీసులు తోసిపుచ్చలేదు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. చనిపోయిన బాలుడి తండ్రి రిక్షా కార్మికుడు కాగా, అతని తల్లి పనిమనిషిగా పనిచేస్తుంది. అయితే నిందితుడు, అతడి కుటుంబ సభ్యులను విచారణ కోసం ప్రీత్ విహార్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా.. బాధిత కుటుంబం అడ్డుకుంది. స్థానికులు, బంధువులతో కలిసి ఆందోళన ప్రారంభించింది.

పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం.. జగదీప్‌ ధన్‌కర్‌కు ప్రధాని మోదీ అభినందనలు..

బాలుడిని, అతడి కుటుంబాన్ని తమకు అప్పగించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ నిరసనతో గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆగ్రహంతో బంధువులు రాళ్లు కూడా రువ్వారు. ఈ గుంపును నియంత్రించడానికి పోలీసులు కొంత బలాన్ని ప్రయోగించక తప్పలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జాయింట్ పోలీస్ కమిషనర్ ఛాయా శర్మ తెలిపారు. ‘‘బాలుడి కుటుంబం ఆగ్రహంతో ఉంది. దీంతో వారు నిందితుడిపై దాడి చేయాలని అనుకున్నారు. అందుకే రాళ్లు రువ్వారు. కానీ ఈ విషయాన్ని పోలీసులు చాకచక్యంగా, ఓపికగా పరిష్కరించారు’’ అని ఆమె తెలిపారు. నిందితుడు బాలుడిని మీరట్ కు ఎలా తీసుకెళ్లాడు ? లైంగిక దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. 

ఏడేళ్ల క్రితం చనిపోయిందనుకున్న మహిళ సజీవంగా.. హత్యానేరంలో జైల్లో యువకుడు.. ట్విస్ట్ ఏంటంటే...

లిసారి గేట్ ప్రాంతంలోని స్మశానవాటిక సమీపంలో 25 ఏళ్ల మహిళ తలలేని మృతదేహం కనిపించిన కొద్ది వారాల తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దర్యాప్తులో ఇది పరువు హత్యగా తేలింది. ఇందులో మహిళ తండ్రే ప్రధాన నిందితుడు. అక్టోబరులో కూడా సంభాల్ లో తలలేని రెండు మృతదేహాలు లభించాయి. వారిద్దరూ బులంద్ షహర్ కు చెందినవారు. ఈ హత్య కేసులో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios