వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్‌పూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు.
వారిద్దరూ దంపతులు. ఐదేళ్ల కిందట వారికి వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ కుమారుడు కూడా కలిగారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఆ భర్త భార్యను దారుణంగా ఇంట్లోనే హత్య చేశాడు. తరువాత తన కుమారుడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడి చేరుకొని విచారణ ప్రారంభించారు. భర్త కోసం గాలింపు చేపట్టారు. చివరికి అతడిని పట్టుకున్నారు. భార్యను ఎందుకు హత్య చేశావని అతడిని ప్రశ్నించారు. అతడు చెప్పిన విషయాలను విన్న పోలీసులు షాక్ కు గురయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ?
మధ్యప్రదేశ్‌లో బస్సులను ఢీకొన్న ట్రక్కు.. 14 మంది మృతి, 60 మందికి గాయాలు.. ఆర్థిక సాయం ప్రకటన
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పూర్ లో అఫ్జల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయన అఖిల (32) అనే యువతిని ప్రేమించాడు. ఐదు సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే జీవనోపాధి కోసం అఫ్జల్ అయోధ్యకు వెళ్లి ఆటో నడుపుతూ ఉండేవాడు. కొన్ని సార్లు కొంత కాలం పాటు అక్కడే ఉంటూ, ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇలా చాలా కాలం పాటు వీరి కాపురం సవ్యంగానే సాగింది. అయితే భార్య ఓ యువకుడితో వివాహేతర సంబంధం మొదలుపెట్టింది. అయితే విషయం కొన్ని రోజుల తరువాత భర్తకు తెలిసింది.
పాకిస్థాన్ గూఢచారితో రహస్య సమాచారాన్ని పంచుకున్న డీఆర్డీవో అధికారి అరెస్టు
దీంతో పద్దతి మార్చుకోవాలని భర్త భార్యకు సూచించాడు. తనతో పాటు అయోధ్యకు వెళ్లే సమయంలో భార్య, కుమారుడిని కూడా తీసుకొని వెళ్లాడు. అక్కడ కాపురం పెట్టాడు. అక్కడికి వెళ్లినా కూడా భార్య తీరులో మార్పు రాలేదు. తన ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూనే ఉండేది. ఇలా వీరి మధ్య సంభాషణ గంటల తరబడి సాగుతూ ఉండేది. కొన్ని సార్లు అఖిలను కలిసేందుకు ఆమె ప్రియుడు తన నివాసానికి కూడా వస్తున్నాడని భర్తకు డౌట్ వచ్చింది. దీంతో అఫ్జల్ ఈ విషయంలో భార్యను నిలదీశాడు. తాను ప్రియుడిని వదిలేసి ఉండలేనని అఖిల కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.
భార్య మాటలతో అఫ్జల్ ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లోనే గొడ్డలితో ఆమెపై దాడి చేసి హతమార్చాడు. తరువాత కుమారుడిని తీసుకొని అక్కడి నుంచి పారారయ్యాడు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. అప్పటి నుంచి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పట్టుకొన్నారు. అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తీసుకెళ్లారు.
