Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. వంట చేయ‌డానికి నిరాక‌రించింద‌ని భార్యను ఫ్రైయింగ్ పాన్ తో కొట్టి చంపిన భ‌ర్త‌.. ఎక్క‌డంటే ?

వంట చేసి పెట్టలేదనే కోపంతో భార్యను ఫ్రైయింగ్ పాన్ తో భర్త కొట్టి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. 

The husband killed his wife by beating her with a frying pan because she refused to cook.. Incident in Noida
Author
First Published Sep 11, 2022, 4:42 PM IST

తనకు వండి పెట్టడానికి నిరాకరించిందనే కారణంతో 35 ఏళ్ల వ్యక్తి తన భార్యను ఫ్రైయింగ్ పాన్ తో కొట్టి చంపాడు ఓ భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నోయిడా ప‌ట్ణ‌ణంలోని సెక్టార్ 66లోని వారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరని, పెద్ద కొడుకు స్కూల్ కు వెళ్లాడని, చిన్న కొడుకు తన మామ ఇంటికి వెళ్లాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.

వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ కు చెందిన అనుజ్ కుమార్ కొన్నేళ్ల కింద‌ట నోయిడాకు త‌న కుటుంబంతో స‌హా వ‌చ్చాడు. ఆటో న‌డుపుతూ జీవ‌నం సాగిస్తున్నాడు. అత‌డికి 30 ఏళ్ల భార్య ఖుష్బూ, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. వారు నాలుగు నెల‌ల కింద‌ట సెక్టార్ 66 ప్రాంతంలోని శ్రామిక్ కుంజ్ లోని ఓ ఇంటికి మారారు. ప్ర‌తీ రోజు లాగే శ‌నివారం ఉద‌యం కూడా ఆటో న‌డ‌ప‌డిపేందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు. 

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు దోసెలు పంపి నిర‌స‌న తెలిపిన కాంగ్రెస్.. ఎందుకంటే ?

బ‌య‌ట‌కు వెళ్లే ముందు భార్య ఖుష్బును త‌న కోసం ఆహారం చేయాల‌ని కోరాడు. దీనికి ఆమె నిరాక‌రించింది. దీంతో ఇద్ద‌రి మధ్య గొడ‌వ మొద‌లైంది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఆగ్ర‌హంతో రెచ్చిపోయిన భ‌ర్త అనుజ్ ఇంట్లో ఉన్న ఫ్రైయింగ్ పాన్ తీసుకొని తన భార్య తలపై గ‌ట్టిగా కొట్టాడు. దీంతో ఆమెకు గాయం అయ్యింది. అయితే త‌ల‌పై అనేక సార్లు పాన్ తో కొట్టాడ‌ని, దానికి సంబంధించిన గాయాలు ఉన్నాయ‌ని త‌రువాత నివేదిక‌లో తేలింది. 

భ‌ర్త ఫ్రైయింగ్ పాన్ తో కొట్ట‌డంతో భార్య‌కు తీవ్ర ర‌క్తస్రావం అయ్యింది. అప‌స్మారస్థితికిలోకి వెళ్లిపోయింది. అనంత‌రం ప‌రిస్థితి విష‌మించి చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై ఇరుగుపొరుగు వారు పోలీసుల‌కు సమాచారం అందించారు. దీంతో ఫేజ్ ౩ పోలీసు స్టేషన్ నుండి అధికారుల బృందం వెంటనే ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ స‌మ‌యంలో మ‌హిళ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించిందని సెంట్రల్ నోయిడా ఏసీపీ అబ్దుల్ ఖాదిర్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహాన్ని శవ పరీక్ష కోసం హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. 

‘‘త‌మిళ అమ్మాయినే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారు ’’ యాత్రలో స‌ర‌దా క్ష‌ణాల‌ను ట్వీట్ చేసిన జైరాం రమేష్..

ఫ్రైయింగ్ పాన్ తో అనేక సార్లు బాద‌డంతో మహిళ తల ప‌గిలిపోయింద‌ని ప‌రీక్ష‌ల్లో తేలిన‌ట్టు పోలీసులు తెలిపారు. ‘‘ నేరం జరిగిన సమయంలో ఈ జంట ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. చిన్న కుమారుడు తన మేనమామ ఇంటికి వెళ్ళగా, పెద్ద కుమారుడు స్కూల్ కు వెళ్లాడు. ఈ ఘటన పై బీహార్ లోని మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం ’’ అని ఫేజ్ 3 పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.

మహిళ భర్త ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాత ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేస్తామని విజయ్ కుమార్ తెలిపారు. 

కృష్ణంరాజు మరణం కలచివేసింది: కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ సానుభూతి

నిందితుడు అనుజ్ కుమార్ నిత్యం మద్యం మత్తులో ఉండేవాడని, ఈ విషయంలోనే ఈ జంట మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉండేవని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ జంట గొడవపడిన ప్రతిసారీ అనూజ్ తన భార్యను కొట్టేవాడ‌ని పేర్కొన్నారు. కానీ ఈ నేరం జ‌రిగిన‌ప్పుడు నిందితుడు మ‌ద్యం మత్తులో లేడ‌ని పోలీసులు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios