Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు దోసెలు పంపి నిర‌స‌న తెలిపిన కాంగ్రెస్.. ఎందుకంటే ?

బెంగళూరు వరదలతో ఇబ్బంది పడుతున్న సమయంలో దోసను ప్రమోట్ చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు కాంగ్రెస్ విన్నూత్నంగా నిరసన తెలిపింది. రెస్టారెంట్ల నుంచి ఆయనకు హోమ్ డెలివరీ సిస్టమ్ ద్వారా దోసెలు పంపించింది. 

Congress sent dosas to BJP MP Tejaswi Surya and protested.. because?
Author
First Published Sep 11, 2022, 3:26 PM IST

భారీ వర్షాలు, వరదల కారణంగా అత‌లాకుత‌లం అయిన బెంగుళూరులో దోస‌ను తింటూ ఎంజాయ్ చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై తీరుపై కాంగ్రెస్ విరుచుకుపడింది. బెంగ‌ళూరు ఎంపీకి ప్రజల క‌ష్టాల కంటే రెస్టారెంట్ల ఆదరణపైనే ఎక్కువ శ్రద్ధ ఉంద‌ని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ మేర‌కు ఆ ప‌ట్ట‌ణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్ల నుంచి 10 ర‌కాల దోసెల‌ను తేజ‌స్వీ సూర్య‌కు పంపించారు.

ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విద్యార్థుల‌ను త‌యారు చేయాలి - ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

ఆదివారం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు 10 దోసెలను ఆర్డర్ చేసి, వాటిని డోర్‌స్టెప్ డెలివరీ యాప్ ద్వారా ఎంపీ కార్యాలయానికి పంపించారు. వీటికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ తన విధులను నిర్వర్తించడంలో బాధ్యతారాహిత్యానికి తేజస్వి సూర్యకు వ్యతిరేకంగా నిరసన. బెంగళూరులోని ప్రముఖ హోటళ్ల నుండి అతడికి 10 డిఫ్ దోసెల పార్శిల్ పంపాం. అతడిని ఈ ఉచిత దోసె తిననివ్వండి, హోటల్ మార్కెటింగ్ గురించి చింతించకండి. పార్లమెంటు ప్రజల కోసం పని చేయండి’’ అని తేజేష్ అనే కాంగ్రెస్ కార్యకర్త ఈ వీడియోను ట్విట్ట‌ర్ లో షేర్ చేస్తూ పేర్కొన్నారు.

నగరంలోని అనేక ప్రాంతాలు కుండపోత వర్షాలు, వరదలతో అల్లాడుతున్నప్పుడు, బెంగళూరు సౌత్ లోక్‌సభ సభ్యుడు, బీజేపీ నాయ‌కుడు తేజస్వి సూర్య తన నియోజకవర్గంలో దోసె రుచిగా ఉందంటూ.. తినుబండారాన్ని ప్రమోట్ చేశారు. దీనిపై సోష‌ల్ మీడియాలో అనేక ట్రోల్స్ వచ్చాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య బల్లాల్ మసాలా దోసను ఆస్వాదిస్తున్న బీజేపీ ఎంపీ వీడియోను షేర్ చేశారు. అందులో తేజస్వీ సూర్య “ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఒకదాన్ని చూసిన తర్వాత, ఈ ‘బెన్నె మసాలా దోస’ను తిన‌డానికి నేను పద్మనాభనగర్‌కు వ‌చ్చాను. నేను ఈ దోసను ప్రేమిస్తున్నాను. నేను కూడా ఇష్టపడుతున్నాను. మీరందరూ వారి ఉప్పిట్టు(ఉప్మా)ని కూడా ప్రయత్నించమని సూచించండి. మీరు కూడా దీనిని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ’’ అని అన్నారు. 

కృష్ణంరాజు మరణం కలచివేసింది: కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ సానుభూతి

ఈ వీడియోను చేస్తూ.. బెంగుళూరు మునిగిపోతున్నప్పుడు తేజస్వీ సూర్య దోసెను ఆస్వాదిస్తున్నారని లావణ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ సెప్టెంబర్ 5 నాటి వీడియో ఇది. బెంగుళూరు మునిగిపోతున్నప్పుడు తేజస్వి సూర్య మంచి అల్పాహారాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒక్క వరద ప్రభావిత ప్రాంతాన్ని అయినా సందర్శించారా?’’ అని పేర్కొన్నారు.

మాజీ కాంగ్రెస్ ఎంపీ, నటి రమ్యతో పాటు పలువురు ట్విట్టర్ వినియోగదారులు సూర్య వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. “ఫుడ్ బ్లాగర్ తేజస్వి సూర్య.. మీరు ఇతర హోటళ్లను ప్రమోట్ చేయాలనుకుంటే ఓఆర్ఆర్ లో కాఫీ కోసం కలుద్దాం. బెంగళూరు సౌత్‌కు చెందిన మీ ఓటర్లు అక్కడ పనిచేస్తున్నారు” అని ఓ ట్విట్టర్ వినియోగదారు తెలిపారు. ‘‘ రోమ్ కాలిపోయినప్పుడు, నీరో ఫిడేల్ వాయించాడు ! బెంగళూరు మునిగిపోయినప్పుడు తేజస్వి సూర్య దోసెలు తిని, అధికారంలోకి వచ్చిన ప్రజలను ఎగతాళి చేశాడు. మీరు (ఓటర్లు) మళ్లీ ఓటు వేసేటప్పుడు ఈ ఫొటోను.. అతడి చిరునవ్వును గుర్తుంచుకోండి ” అని ఆప్ నేత పృథ్వీ రెడ్డి ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios