Asianet News TeluguAsianet News Telugu

ఫుల్లుగా తాగి మండపానికి లేటుగా వ‌రుడు.. అత‌డితో పెళ్లి వ‌ద్ద‌ని చెప్పిన వ‌ధువు.. అక్క‌డే బంధువుల అబ్బాయితో..

మద్యం సేవించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలుసు. కానీ దానిని దూరం పెట్టడానికి కొందరికి మనసు అంగీకరించదు. అయితే అనారోగ్యం విషయం పక్కన పెడితే.. మద్యం తాగడం వల్ల ఓ వ్యక్తి వివాహం  పీటల వరకు వచ్చి ఆగిపోయింది. ఎందుకలా జరిగింది.. ఎక్కడ జరిగింది అనే విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. 

The groom who came late to the wedding after drinking alcohol .. The bride who said no to marriage
Author
Churu, First Published May 18, 2022, 10:18 AM IST

వారిద్ద‌రికి పెద్ద‌లు పెళ్లి నిర్ణ‌యించారు. ముహుర్తాలు ఖ‌రారు చేశారు. ఇంటి వ‌ద్ద‌నే పెళ్లి మండ‌పం అందులో ఘ‌నంగా వివాహం చేద్దామ‌ని అంతా ప్లాన్ చేశారు. అనుకున్న ప్ర‌కారమే పెళ్లి కూతురు మండ‌పానికి చేరుకుంది. పెళ్లి తంతు ప్రారంభ‌మైంది. కానీ వ‌రుడు ఇంకా మండ‌పానికి చేరుకోలేదు. ఆ లోపు పెళ్లి కూతురుతో జ‌రిపించాల్సిన పూజ‌లు, ఇత‌ర కార్య‌క్ర‌మాలు చేయించారు. కానీ అప్ప‌టికీ వ‌ర‌డు రాలేదు. ఏం జ‌రిగింద‌ని ఆరా తీస్తే పెళ్లి కొడుకు ఫుల్లుగా త‌ప్ప‌తాగి స్నేహితుల‌తో బార‌త్ (పెళ్లి ఊరేగింపు)లో చిందులేస్తున్నాడ‌ని తెలిసింది. ఈ విష‌యం ప‌లువురు పెద్ద‌లు చెప్పినా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించాడు. మెళ్ల‌గా, పెళ్లి టైం దాటిన త‌రువాత వ‌రుడు అక్క‌డికి చేరుకున్నాడు. చాలా స‌మ‌యం నుంచి అక్క‌డే ఎదురు చూస్తున్న పెళ్లి కూతురుకు అత‌డి ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌లేదు. వెంట‌నే అత‌డిని పెళ్లి చేసుకోన‌ని తేల్చిచెప్పింది. ఆమె నిర్ణ‌యాన్ని కుటుంబ స‌భ్యులు కూడా స‌మ‌ర్ధించారు. వెంట‌నే అదే మండ‌లంలో బంధువుల అబ్బాయితో పెళ్లి ఖాయం చేసి, వివాహం జ‌రిపించారు. 

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొన్న బస్సు.. ముగ్గురు భక్తులు మృతి..

ఇది రాజస్థాన్‌లోని చురు జిల్లాలో చోటు చేసుకుంది. రాజ్‌గఢ్ తహసీల్‌లోని చెలానా గ్రామంలో మే 15వ తేదీన సునీల్ కు వివాహం జ‌రగాల్సి ఉంది. రాత్రి 1.15 గంట‌ల‌కు పెద్ద‌లు ముహుర్తం నిర్ణ‌యించారు. దీని కోసం వ‌రుడు ఒక రోజు ముందే ఆ గ్రామానికి వ‌చ్చి ఉన్నాడు. అత‌డు బ‌స చేసిన ఇంటి నుంచి రాత్రి  9 గంటలకు పెళ్లి మండ‌పానికి బారాత్ బ‌య‌లుదేరింది. అయితే ఈ బార‌త్ లో త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి పెళ్లి కొడుకు మందు తాగాడు. డీజే పాట‌ల‌కు గ‌మ్మ‌త్తుగా స్టెప్పులేశాడు. ఇలా స్నేహితులతో క‌లిసి డ్యాన్స్ చేస్తూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో గంటల త‌ర‌బ‌డి ఆల‌స్యం అయ్యింది.  

ఎట్ట‌కేల‌కు తీరిగ్గా పెళ్లి కొడుకు మండ‌పానికి చేరుకున్నాడు. కానీ అత‌డి వ్య‌వ‌హారం, పెళ్లి ప‌ట్ల నిర్లక్ష్యం వంటి విష‌యాలు న‌చ్చ‌ని వ‌ధువు ఓ నిర్ణ‌యం తీసుకుంది. తాను అత‌డిని పెళ్లి చేసుకోబోన‌ని చెప్పింది. ఆ నిర్ణ‌యాన్ని ఆమె త‌ర‌ఫు బంధువులు, కుటుంబ స‌భ్యులు కూడా స‌మ‌ర్థించారు. పెళ్లికి ముందే వ‌రుడు తీరు ఇలా ఉంటే.. పెళ్లి త‌రువాత ఇంకెలా ఉంటోంద‌ని ఆ పెళ్లిని అక్క‌డే క్యాన్సిల్ చేశారు. 

పెళ్లై ఆరు నెల‌లైనా.. భార్య‌కు చీర క‌ట్టుకోవ‌డం రావ‌డం లేద‌ని భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌..

ఆ పెళ్లి చూడ‌టానికి వ‌చ్చిన వ‌ధువు త‌రుఫు బంధువుల్లో మంచి అబ్బాయిని చూసి పెళ్లికి ఒప్పించారు. అత‌డు స‌రే అన‌డంతో అదే మండ‌పంలో పెళ్లి జ‌రిపించారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత వరుడి కుటుంబం వధువు కుటుంబంపై ఫిర్యాదు చేసేందుకు రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. పెళ్లి పీటలు ఎక్కే స‌మ‌యంలోనే వ‌రుడు, అత‌డి కుటుంబ సభ్యులు నిర్ల‌క్ష్యంగా ఉన్నార‌ని, భవిష్యత్తులోనూ ఇదే వైఖరి కొనసాగితే త‌మ బిడ్డ ప‌రిస్థితి ఏంట‌ని వ‌ధువు త‌ర‌ఫు బంధువులు చెప్పారు. దీంతో పోలీసుల స‌మ‌క్షంలో రాత‌పూర్వ‌కంగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios