Asianet News TeluguAsianet News Telugu

పెళ్లై ఆరు నెల‌లైనా.. భార్య‌కు చీర క‌ట్టుకోవ‌డం రావ‌డం లేద‌ని భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌..

తన భార్యకు చీర కట్టుకోవడం రావడం లేదంటూ ఆవేదన చెందుతూ ఆ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో వెలుగులోకి వచ్చింది. 

Husband commits suicide as he does not want his wife to wear a sari
Author
Aurangabad, First Published May 18, 2022, 8:57 AM IST

వారిద్ద‌రికీ వివాహం జ‌రిగి ఆరు నెల‌లు అవుతోంది. సంతోషంగా సాగిపోతున్న కాపురం. కానీ భార్య ప‌ట్ల భ‌ర్త‌కు కొంత అసంతృప్తి నెల‌కొంది. దానికి కార‌ణం భార్య స‌రిగా చీర క‌ట్టుకోక‌పోవ‌డమే. ఈ విష‌యంలో తీవ్రంగా మ‌ద‌న‌ప‌డిన ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకుంది. 

మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్ కు చెందిన సమాధాన్‌ సాబుల్ (24) అనే వ్య‌క్తికి ఆరు నెల‌ల కింద‌ట పెళ్లి జ‌రిగింది. ఆ జంట ముకుంద్ నగర్ లో ఉంటోంది. అయితే ఉన్న‌ట్టుండి ఒక్క సారిగా భ‌ర్త ఇంట్లోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో అక్క‌డికి పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో ప‌రిశీలించ‌గా సూసైడ్ నోట్ దొరికింది. అందులో అత‌డు త‌న ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను వివ‌రించాడు. 

Assam floods : అస్సాంలో వ‌ర‌ద‌ల విలయ తాండ‌వం.. 4 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం.. 8 మంది మృతి..

పైళ్లైన దగ్గరి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు త‌న భార్య‌కు చీర క‌ట్టుకోవ‌డం రావ‌డం లేద‌ని అందులో పేర్కొన్నాడు.  అలాగే భార్య‌కు స‌రిగా న‌డ‌వ‌డం రాద‌ని, మాట్లాడ‌టం రాద‌ని తెలిపాడు. ఈ విష‌యంలోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్నాన‌ని పేర్కొన్నాడు. అయితే ఈ ఆత్మ‌హ‌త్య విషయంలో పోలీసులు ప‌లు వివ‌రాలు వెల్ల‌డించారు. 

మృతుడు సమాధాన్‌ సాబుల్ కంటే అత‌డి భార్య ఆరేళ్లు పెద్ద‌ద‌ని చెప్పారు. వారిద్ద‌రికి వైవాహిక జీవ‌తంలో సంతోషం లేద‌ని తెలిపారు. భార్య స‌రిగా మాట్లాడ‌లేదని, అలాగే చీర‌కట్టుకోవ‌డం లేద‌ని, న‌డ‌వ‌డం లేద‌ని అత‌డు అసంతృప్తిగా ఉన్నాడ‌ని చెప్పారు. అందుకే అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని సూసైడ్ నోట్ తెలుపుతోంద‌ని అన్నారు. ఆ సూసైడ్ నోట్ ను తాము స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా.. త‌న భార్య వేరే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌నే అనుమానంతో ఓ భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం తురకపాలెంలో రెండు రోజుల కింద‌ట చోటు చేసుకుంది. షేక్ భరన్ అనే వ్య‌క్తి త‌న ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్పీ వీడియోలో తన భార్య ప్రవర్తన సరిగా లేదని చెప్పాడు. తన భార్య ఏడాది పాటుగా తనను మోసం చేసిందని అతడు ఆరోపించాడు.

Gyanvapi survey: సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం: అసదుద్దీన్ ఒవైసీ

తన భార్య వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుందని ఆ వీడియో తెలిపాడు. ఇది తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు తనను తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపేందుకు పలుమార్లు ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. వ్యవస్థ మీద  నమ్మకం ఉందని.. తన భార్యను కఠినంగా శిక్షించాలని కోరాడు. తన భార్య కాల్ వివరాలను ఇక్కడే ఉంచుతున్నానని చెప్పాడు. అనంతరం  ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.  కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios