కారు బానెట్‌పై పోలీసును 400 మీటర్ల దూరం లాక్కెళ్లిన డ్రైవర్.. వీడియో వైరల్...
ఓ పోలీసును కారు బానెట్ పై ఎక్కించుకుని స్పీడ్ గా వెళ్లి.. సర్కిల్ దగ్గర డివైడర్ కు గుద్దారు. దీంతో ఆ పోలీస్ గాయలపాలయ్యాడు.
గుజరాత్ : గుజరాత్‌లోని సూరత్‌లో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వెహికిల్ చెకింగ్ సమయంలో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వెహికల్ చెకింగ్ డ్రైవ్ సందర్భంగా ఓ పోలీసు అధికారిని కారు బానెట్‌తో గుద్ది.. బానెట్ పై దాదాపు 300 నుంచి 400 మీటర్ల దూరం లాక్కెళ్లారు. కటార్గాం ప్రాంతంలోని అల్కాపురి ఓవర్‌బ్రిడ్జి కింద జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది.
ఫుటేజీలో తెల్లటి స్కోడా కారు బానెట్‌పై ఒక పోలీసు అధికారి గట్టిగా పట్టుకుని ఉండడం.. కారు వేగంగా వెళ్తుండడం కనిపిస్తుంది. ఆ తరువాత రోడ్డు సర్కిల్ సమీపంలో కారు స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొట్టడంతో, అధికారి కిందపడిపోవడం.. విధుల్లో ఉన్న ఇతర అధికారులు కారును వెంబడించడం ఈ వీడియోలో కనిపిస్తంది.
గాయపడిన అధికారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కారు డ్రైవర్‌పై హత్యాయత్నం కింద కాటర్‌గాం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఘటనకు కారణమైన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సూరత్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఝలా తెలిపిన వివరాల ప్రకారం, కతర్గాం పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం అల్కాపురి వంతెన కింద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నంబర్ ప్లేట్ లేని తెల్లటి స్కోడా కారును గుర్తించారు. వారు కారును ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ గౌతమ్ జోషి అనే పోలీసును ఈడ్చుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు.
"డ్రైవర్ 300-400 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత అతనిని చంపడానికి ప్రయత్నించి.. బానెట్ నుంచి కిందికి పడేయడానికి ప్రయత్నించాడు’’ అని ఏసీపీ తెలిపారు. దీనిమీద తదుపరి విచారణ జరుగుతోంది.