Asianet News TeluguAsianet News Telugu

సంచిని ఎత్తుకెళ్తున్న కుక్క.. దానిని ఆపి సంచిని తెరిచి చూడటంతో షాక్... అందులో ఏముందంటే ?

రాజస్థాన్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఎనిమిది నెలల చిన్నారి మృతదేహాన్ని ఓ కుక్క ఈడ్చుకెళ్లింది. ఓ రైతు దానిని గమనించి కుక్కను తరిమివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. 

The dog who was picking up the bag..stopped it and opened the bag and was shocked...what was in it?
Author
First Published Jan 14, 2023, 1:56 PM IST

అతడో రైతు. ఎప్పటిలాగే పొలానికి వెళ్లి నీళ్లు పెడుతున్నాడు. అయితే అదే సమయంలో పక్క నుంచి ఓ కుక్క పరిగెడుతోంది. దాని నోట్లో ఓ సంచి ఉంది. దీంతో రైతుకు అనుమానం వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్లి కుక్కను ఆపాడు. దానిని హడలెత్తించడంతో సంచి అక్కడే వదిలేసి కుక్క పారిపోయింది. అయితే రైతు ఆ సంచిని తెరిచి చూశాడు. వెంటనే షాక్ అయ్యాడు. ఆ సంచిలో 8 నెలల పసికందు మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశాడు.

20 మంది పిల్లలపై కామంతో కీచక ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. తరగతి గదిలోనే జుగుప్సాకరంగా..!

రాజస్థాన్‌ రాష్ట్రంలోని బార్మర్‌ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సేద్వా గ్రామానికి చెందిన  రైతు హనుమంతరామ్ శుక్రవారం ఉదయం సమయంలో తన పొలంలో పని చేస్తున్నాడు. ఇదే సమయంలో ఓ చిన్నారి మృతదేహం ఉన్న సంచిని ఓ కుక్క దాని నోటితో పట్టుకెళ్తోంది. ఆ రైతు ఆ కుక్కను ఆపేసి, చిన్నారి మృతదేహాన్ని దాని నుంచి రక్షించాడు. ఈ సమచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి డెడ్ బాడీని స్థానికంగా ఉండే హాస్పిటల్ కు తలించి పోస్టుమార్టం నిర్వహించారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ ప్రారంభించారు. అయితే ఆడపిల్ల జన్మించింది అనే కారణంతో తల్లిదండ్రులు చిన్నారిని విడిచిపెట్టి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గంటల వ్యవధిలో కవల సోదరులు మృతి.. ఒకే చితిపై అంత్యక్రియలు.. రాజస్థాన్ లో విషాదం..

రాజస్థాన్‌లోని ఇదే బార్మర్‌లో జిల్లాలో ఒక్క రోజు వ్యవధి కూడా లేని పసికందును ఎవరో ముళ్ల పొదల్లో పడేశారు. ఆ పసి కూన రాత్రంతా చలిలోనే ఉండిపోయింది. నలుగురు స్నేహితులు మార్నింగ్ వాక్ కోసం బయటకు ఈ పసికందు ఏడుపు గమనించారు. పాపను రక్షించి హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స అందిచడంతో బాలిక ఆరోగ్యం మెరుగుపడింది. ఈ ఘటన ఐదు రోజుల కిందట వెలుగులోకి వచ్చింది.

లవర్‌తో సీక్రెట్ ప్లేస్‌కు వెళ్లిన యువతిపై బాయ్‌ఫ్రెండ్ ముందే గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితులు అరెస్టు

బలోత్రా పట్టణానికి చెందిన మంగీలాల్, ప్రకాష్ కుమార్, రాజు, ముఖేష్ అనే నలుగురు స్నేహితులు మార్నింగ్ వాక్ చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. పొదల్లో బాలిక ఏడుపు శబ్దం వినిపించడంతో ముఖేష్ ఆ చుట్టుపక్కల వెతికారు. ఎంతో సేపు గాలించిన తరువాత వారందరికీ ఆ చిన్నారి కవర్ లో చుట్టి ఉన్నట్టు కనిపించింది. వెంటనే ఆ బాలికను శాలువాలోకి తీసుకొని, పోలీసులకు సమాచారం అందించి, హాస్పిటల్ కు తరలించారు. అధిక ఉష్ణోగ్రతలు లేకపోవడంతో శిశువుకు ప్రమాదం జరగలేదని డాక్టర్లు తెలిపారు. ఆ ప్రాంతంలో కుక్కలు, పందులు అధికంగా సంచరిస్తూ ఉంటాయి. కానీ ఆ పాపకు ఏం జరగకముందే స్నేహితులు కాపాడారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios