20 మంది పిల్లలపై కామంతో కీచక ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. తరగతి గదిలోనే జుగుప్సాకరంగా..!
కేరళలో అభంశుభం తెలియని ఆరు, ఏడో తరగతి పిల్లలపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచక ఉపాధ్యాయుడు అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. 2021 నవంబర్ నుంచి తరగతి గదిలోనే ఈ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఓ బాలిక మరో టీచర్‌కు దీనిపై మాట్లాడటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తిరువనంతపురం: కేరళలో ఓ కీచక ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని పిల్లలపై కామంతో రగిలిపోయాడు. సుమారు 20 మంది పిల్లలపై వాంఛతో పంజా విసిరాడు. తన కామ కోరికలు తీర్చుకున్నాడు. 2021 నవంబర్ నుంచి ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. తరగతి గదిలోనే తరుచూ పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. 52 ఏళ్ల ఆ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. కన్నూర్‌లోని తాలిపరంబా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు ఆ కీచక ఉపాధ్యాయుడిని సీ ఫైజల్‌గా గుర్తించారు మలప్పురంలోని కొండొత్తి నివాసి. ఆ స్కూల్‌లో అరబిక్ భాష బోధిస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని కస్టడీకి కోర్టు రిమాండ్‌కు పంపింది.
2021 నవంబర్ నుంచి నిందితుడు క్లాసు రూమ్‌లోనే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థులు ఆరో తరగతి, ఏడో తరగతికి చెందిన చిన్నారులు.
నిందితుడిని పోక్సో యాక్ట్‌లోి సెక్షన్ 7,8,9ల కింద బుక్ చేశారు.
ఆ చిన్నారుల్లో ఒకరు మరో టీచర్‌కు ఈ విషయాలు తెలుపడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించారు. అంతేకాదు, ఈ విషయాన్ని స్కూల్ అధికారులు చైల్డ్ లైన్‌కు కూడా చేర వేశారు. ఈ ఘటన పై స్థానికంగా కలకలం రేగింది.