Hyderabad: ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య విధ్వంస‌కుడు, గ్రాండ్ ఫాద‌ర్ ఆఫ్ హిపోక్ర‌సీ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. శ‌నివారం నాడు బీఆర్ఎస్ నాయ‌కురాలు కల్వకుంట్ల కవిత ఈడీ ముందు హాజరయ్యారు. ఇదే విష‌యంపై బీజేపీ, మోడీని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. 

Hyderabad: ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నాయ‌కులు, వారి బంధువుల ఇండ్ల‌పై వ‌రుసగా కేంద్ర ఏజెన్సీల దాడుల మ‌ధ్య విమ‌ప‌క్షాలు బీజేపీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నాయి. రాజ‌కీయ క‌క్ష‌తో ఇలా దాడులు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నాయి. ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికార‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నాయి. ఇక తెలంగాణ ముఖ్య‌మంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఈడీ త‌మ‌ముందు హాజ‌రుకావాల‌ని నోటీసులు ఇచ్చిన త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాలు మ‌రింత హీటెక్కాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ లో బీజేపీని, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ హైద‌రాబాద్ న‌గ‌రంలో పోస్ట‌ర్లు వెలిశాయి. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య విధ్వంస‌కుడు, గ్రాండ్ ఫాద‌ర్ ఆఫ్ హిపోక్ర‌సీ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. శ‌నివారం నాడు బీఆర్ఎస్ నాయ‌కురాలు కల్వకుంట్ల కవిత ఈడీ ముందు హాజరయ్యారు. ఇదే విష‌యంపై బీజేపీ, మోడీని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ గోడలపై దర్శనమిచ్చిన పోస్టర్లలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులు, మరోవైపు టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఆ పోస్టర్లలో కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేత సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలను ఉంచారు. చివర్లో "బై బై మోదీ" అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మ‌రో పోస్ట‌ర్ లో ప్ర‌ధాని మోడీ.. ప‌ది త‌ల‌ల రావాణాసురుడి గెట‌ల్ లో క‌నిపించారు. అంతులో త‌ల‌ల‌కు సీబీఐ, ఈడీ, ఐటీ ఇలా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు చెందిన పేర్ల‌ను పేర్కొన్నారు. పోస్ట‌ర్ పై భాగంలో "ప్రజాస్వామ్య విధ్వంస‌కుడు ప్రధాని నరేంద్ర మోడీ" అని ఉండ‌గా, కింది భాగంలో "గ్రాండ్ ఫాద‌ర్ ఆఫ్ హిపోక్ర‌సీ" అని ఉంది. ఇదిలావుండ‌గా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను ఈడీ నేడు ఢిల్లీలో విచారిస్తోంది. శుక్రవారం ఢిల్లీలో తాను నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో తన విచారణను శనివారానికి వాయిదా వేయాలని కవిత ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కోరారు. ఆమె అభ్యర్థనను అంగీకరించిన కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణను నేటికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ విచారణకు సమన్లు జారీ చేసిన కొద్ది గంటల్లోనే మార్చి 8న ఆమె దేశ రాజధానికి చేరుకున్నారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా ఈడీ విచారించింది.