మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఆలయ ప్రమాదంలో మృతుల సంఖ్య 36కు చేరుకుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారికి, గాయపడిన వారికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నష్టపరిహారం ప్రకటించారు. 

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గురువారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ బెలేశ్వర్ మహాదేవ్ ఝులేలాల్ ఆలయం మెట్లబావిపైకప్పు బావిలో పడిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు అందులోకి జారిపోయారు. దీంతో నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 36 కు చేరుకుంది. వారి బాడీలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 

ప్రియుడికోసం యువతి మాస్టర్ ప్లాన్.. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని, తనలాగే ఉండే మరో యువతిని హత్య చేసి.. పరార్...

ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్న ఆలయం ఇండోర్ లోని పటేల్ నగర్ ప్రాంతంలో ఉంది. అయితే ఈ ఘటనలో 50 మందికి పైగా చనిపోయి ఉంటారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఇండోర్ కలెక్టర్ ఇలియా రాజా టి తెలిపారు. ఇప్పటికైతే 36 మంది చనిపోయారని తెలుస్తోందని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు మరణించారని తెలిపారు.

‘‘ఇండోర్ లోని జుని ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 36 మృతదేహాలను వెలికితీశారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. నిన్న అర్థరాత్రి ఆర్మీ బృందాన్ని కూడా రెస్క్యూ ఆపరేషన్ కోసం పిలిపించాం. పగలు 11 మృతదేహాలను, అర్థరాత్రి వరకు 24 మృతదేహాలను కనుగొన్నాం. ’’ అని ఇండోర్ కలెక్టర్ ఇలియా రాజా టి ‘టైమ్స్ నౌ’తో చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 

నేను లొంగిపోవడం లేదు : అమృతపాల్ సింగ్ వీడియో యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం..

ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. కాగా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తోందని ప్రధాని చెప్పారు.

530 పేజీల బంగారు రామాయణం.. వజ్రాలు, కెంపులు.. నవరత్నాలతో అదనపు హంగులు.. ఎక్కడంటే...

ఇదిలా ఉండగా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు 70 మంది ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆలయంలో హవన్ సందర్భంగా భక్తులు నేలపై కూర్చొని ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే వీరంతా కూర్చున్న నేల కింద ఒక బావాడీ (మెట్లబావి) ఉంది. ఈ సమయంలో మెట్లబావి సిమెంట్ సీల్ కూలిపోవడంతో భక్తులు బావిలో పడిపోయారు. అంతకు ముందు ఈ మెట్లబావిపై స్లాబ్ లేదు. ఇటీవల దానిని కాంక్రీట్ స్లాబ్ తో కప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో లోడ్ కారణంగా కాంక్రీట్ కూలిపోయిందని భన్వర్కువాన్ పోలీసులు తెలిపారు.