శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, సూరత్ లోని ఓ దేవాలయంలో దశాబ్దాల క్రితం తయారు చేసిన బంగారు రామాయణ పుస్తకం భక్తులకు కనువిందు చేసింది. 

గుజరాత్ : హిందువుల ఆరాధ్య గ్రంథం రామాయణం. ఈ గ్రంథం అనేక వెర్షన్లలో దొరుకుతుంది. వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం.. ఇలా అనేక వెర్షన్లు, భాషల్లో కనిపిస్తుంది. అయితే, గుజరాత్ లోని ఓ గుడిలో బంగారు రామాయణం దర్శనం ఇస్తుంది. మామూలుగా అయితే మొదట్లో తాళపత్రాలు, ఆ తరువాత రకరకాల పేపర్ల మీద ఈ రామాయణాన్ని ముద్రించారు. కానీ, సూరత్ లోని ఈ గుడిలో కనిపించే రామాయణం పుస్తకం అచ్చంగా, బంగారం, వజ్రాలు, వెండి.. నవరత్నాలతో పొదిగి తయారు చేశారు. 

శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని ఓ ఆలయంలో బంగారు రామాయణం దర్శనమిస్తుంది. ఈ రామాయణాన్ని రాయడం కోసం అక్షరాలను 19 కిలోల బంగారంతో తయారు చేశారు. ఇక ఈ రామాయణ మహా కావ్యాన్నిరచించడానికి కావలసిన 530 పేజీలను జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. దీనికోసం 2002 తులాల బంగారు సిరా ఉపయోగించారు. ఈ బంగారు రామాయణం పుస్తకం బరువు సుమారు 19 కిలోల వరకు ఉంటుంది.

శ్రీరామ నవమి రోజున బెంగాల్‌లో అల్లర్లు.. రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు.. వాహనాలకు నిప్పు

ఈ పుస్తకం కోసం బంగారంతో పాటు నాలుగువేల వజ్రాలు, కెంపులు, పచ్చలు, నీలమనులతో పాటు 10 కిలోల వెండిని కూడా ఉపయోగించారు. వీటన్నింటితో రామాయణాన్ని చూడముచ్చటగా అలంకరించారు. వీటన్నింటితో కలిసి ఈ రామాయణం విలువ కోట్లల్లో చేరింది. అయితే ఈ రామాయణం బుక్ ఇప్పటిది కాదు 1981లో రామ్ భాయ్ అనే భక్తుడు ఈ బంగారు రామాయణానికి శ్రీకారం చుట్టాడు. పుష్యమి నక్షత్రం రోజున ఈ పనిని మొదలుపెట్టాడు.

ఈ బంగారు రామాయణం రాయడానికి మొత్తంగా తొమ్మిది నెలల తొమ్మిది గంటల సమయం పట్టిందట. దీనికోసం.. బంగారు రామాయణ మహా యజ్ఞానికి మొత్తంగా 12 మంది భక్తులు సహకరించారు. ఇంత విలువైన ఈ బంగారు రామాయణాన్ని శ్రీరామనవమి రోజున మాత్రమే భక్తుల దర్శనార్థం ప్రదర్శిస్తారు. ఆ తరువాత ఈ రామాయణాన్ని ఏడాది మొత్తం ప్రత్యేక బ్యాంకులో జాగ్రత్త చేస్తారు. దొంగత బారిన పడకుండా ఉండడానికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.