Asianet News TeluguAsianet News Telugu

ద‌ళిత బాలిక‌లు వ‌డ్డించార‌ని మిగితా విద్యార్థుల భోజ‌నం పారేయించిన వంట మ‌నిషి.. రాజ‌స్థాన్ లో ఘ‌ట‌న

దళిత బాలికలు భోజనం వడ్డించారని విద్యార్థుల పేట్లలో ఉన్న భోజనాన్ని పారేయించాడు ఓ వంట మనిషి. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

The cook threw away the food of the rest of the students saying that it had been served by Dalit girls.
Author
First Published Sep 3, 2022, 2:58 PM IST

దేశం టెక్నాలజీలో ఎంతో ముందడుగు వేస్తున్నా.. ప్రతీ రోజూ ఎన్నో కొత్త కొత్త అవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నా.. ఇంకా మ‌న స‌మాజంలో కుల వివ‌క్ష క‌నుమ‌రుగు అవ‌డం లేదు. ఇటీవ‌ల రాజ‌స్థాన్ లో ఓ ద‌ళిత విద్యార్థి కుండ‌లో నీళ్లు తాగాడ‌ని టీచ‌ర్ కొట్ట‌డంతో ఆ పిల్లాడు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న దేశం మొత్తం క‌ల‌క‌లం సృష్టించింది. ఇది మ‌ర‌వక ముందే ఇదే రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ జిల్లాలో మ‌రో కుల వివ‌క్ష ఘట‌న వెలుగులోకి వ‌చ్చింది. 

నా గర్ల్ ఫ్రెండ్ ఐఏఎస్ అధికారి అయింది.. నేను ఐదుసార్లు ఫెయిల్ అయ్యా..: ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థి

బరోడి ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో లాలా రామ్ గుర్జార్ వంట మ‌నిషిగా ప‌ని చేస్తున్నారు. అయితే ఎప్ప‌టిలాగే శుక్ర‌వారం కూడా ఆయ‌న విద్యార్థుల కోసం వంట చేశారు. అయితే ప్ర‌తీ రోజు ఆ భోజ‌నాన్ని ఆ పాఠ‌శాల‌లోని అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిచ పిల్ల‌ల‌తో మిగితా విద్యార్థులు వండించేవాడు. కానీ వారికి స‌రిగా వ‌డ్డించ‌డం రాక‌పోవ‌డంతో ఓ టీచ‌ర్ ద‌ళిత పిల్ల‌ల‌ను అంద‌రికీ భోజ‌నం వ‌డ్డించాల‌ని కోరారు.

నా కుమార్తె చావుకు వారే కారణం.. రూ.1000 కోట్ల న‌ష్ట‌ పరిహారం ఇవ్వాల‌ని డిమాండ్.. బిల్ గేట్స్ కు నోటీసులు

దీంతో ఆ పిల్ల‌లు అంద‌రికీ భోజనం వ‌డ్డించారు. అంద‌రూ తమ ప్లేట్ల‌లో భోజనం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌రూ భోజనం తిన‌వ‌ద్ద‌ని, దానిని విసిరేయాల‌ని మిగితా విద్యార్థుల‌కు సూచించారు. దీంతో ఆ పిల్ల‌లంతా త‌మ ప్లేట్ల‌లోని భోజానాన్ని పారేశారు. 

వివ‌క్ష‌కు గురైన విద్యార్థినులు ఈ సంఘటనను వారి కుటుంబ స‌భ్యుల‌కు వివ‌రించారు. దీంతో వారంద‌రూ కొంత మంది బంధ‌వుల‌ను తీసుకొని పాఠ‌శాల‌కు చేరుకున్నారు. వంటి మ‌నిషిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ స‌మాచారం పోలీసుల‌కు చేర‌వేశారు. దీంతో నిందితుడిపై షెడ్యూల్డ్ కులాలు-షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద గోగుండ పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదు అయ్యింది. అనంత‌రం అరెస్టు చేశారు.

71 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీతతో హాస్పిట‌ల్ లో బ‌ల‌వంతంగా డ్యాన్స్.. డిశ్చార్జ్ అయ్యే స‌మ‌యంలో ఘ‌ట‌న

ఈ ఘ‌ట‌న నిజ‌మని తేల‌డంతో నిందితుడిని అరెస్టు చేశామ‌ని పోలీసులు తెలిపారు. దళిత విద్యార్థినులు భోజనం వడ్డించినందున మిగితా విద్యార్థులు దానిని విసిరేశారు. “ ఆ వంట మ‌నిషి త‌న‌కు న‌చ్చిన అగ్రవర్ణ విద్యార్థులతో మాట్లాడి భోజ‌నం వ‌డ్డించాల‌ని కోరేవాడు. ఆ విద్యార్థులు భోజనం స‌రిగా వ‌డ్డించ‌డం లేద‌ని ఫిర్యాదులు రావ‌వ‌డంతో ఓ ఉపాధ్యాయుడు ద‌ళిత బాలిక‌ల‌ను భోజనం వ‌డ్డించాల‌ని శుక్ర‌వారం కోరారు. దీంతో వారు భోజ‌నం వ‌డ్డించారు. ’’ అని పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios