ఆమె ఓ పద్మశ్రీ అవార్డు గ్రహీత. వయస్సు 71 సంవత్సరాలు. అనారోగ్యంతో హాస్పిటల్ చేరింది. ఐసీయూలో చేర్పించి చికిత్స అందించారు. అయితే డిశ్చార్జ్ చేసే సమయంలో వృద్ధురాలితో బలవంతంగా పలువురు డ్యాన్స్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. 

పద్మశ్రీ అవార్డు గ్రహీత, 71 ఏళ్ల కమలా పూజారి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఒడిశా రాష్ట్రం కటక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే ఐసీయూలో చికిత్స పొంది, సోమ‌వారం డిశ్చార్జ్ అయ్యే స‌మ‌యంలో హాస్పిట‌ల్ లో ఓ సామాజిక కార్య‌క‌ర్త ఆమెతో బ‌ల‌వంతంగా డ్యాన్స్ చేయించారు. ఆ స‌మ‌యంలో పూజారితో వారు సెల్పీలు కూడా తీసుకున్నారు. ఆ వృద్ధురాలు డ్యాన్స్‌ చేసిన వీడియో వైర‌ల్ గా మారి తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆ వీడియోలో సామాజిక కార్యకర్త మమతా బెహెరా కూడా ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

నితీష్ కుమార్‌కు లాలూజీ బుద్ధి చెబుతాడు: బీజేపీ విమర్శలు.. 2024 చాలెంజ్ విసిరిన జేడీయూ

పేషెంట్ తో బలవంతంగా డ్యాన్స్ చేయించిన వారిపై చ‌ర్య తీసుకోవాలని ఒడిశాలోని పరాజ గిరిజన సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. ‘‘ నాకెప్పుడూ డ్యాన్స్ చేయాలనే కోరిక లేదు. కానీ బలవంతంగా చేయవలసి వచ్చింది. నేను డ్యాన్స్ చేయబోనని పదే పదే చెప్పాను. కానీ ఆమె (బెహెరా) వినలేదు. నేను అనారోగ్యంతో ఉన్నాను. అలసిపోయాను ’’ అని పూజారి కోరాపుట్ జిల్లాలోని ఓ టీవీ చానెల్ తో చెప్పారు. 

Scroll to load tweet…

కాగా.. గిరిజన సంఘం అసోషియేషన్ చీఫ్ హరీష్ ముదులి మాట్లాడుతూ సామాజిక కార్యకర్తపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతామన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వరితో సహా వివిధ పంటలకు చెందిన 100 రకాల దేశీయ విత్తనాలను సంరక్షించినందుకు 2019 లో పూజారి పద్మశ్రీ అవార్డు ల‌భించింది. ఆమె కిడ్నీ సమస్యలతో ఇటీవ‌ల కటక్‌లోని SCB మెడికల్ కాలేజీ, హాస్పిట‌ల్ లో చేరారు.

పరాన్నజీవి.. మా దేశంలో ఎందుకున్నావ్ .. మీ దేశానికి వెళ్లిపో.. భారతీయుడిపై జాత్యహంకార దూషణ

పూజారి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. పూజారిని ఐసీయూలో కాకుండా ప్రత్యేక క్యాబిన్‌లో చేర్చామ‌ని, అక్క‌డే ఆ సామాజిక కార్య‌క‌ర్త ఆమెను సందర్శించేద‌ని హాస్పిట‌ల్ రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేటివ్) డాక్టర్ అబినాష్ రౌత్ చెప్పారు. ఆ సామాజిక కార్య‌క‌ర్త బెహెరా తనకు తెలియదని పూజారి అటెండర్ రాజీబ్ హియాల్ తెలిపారు. ఈ వీడియో వివాద‌స్ప‌దమ‌వ్వ‌డంతో బెహెరా స్పందించారు. తాను ఇలా చేయ‌డం వెనుక ఎలాంటి చెడు ఉద్ధేశం లేద‌ని, పూజారి యాక్టివ్ గా ఉండేల‌నే తాను ఇలా చేశాన‌ని ఆమె చెప్పారు. కాగా.. పూజారి ఒడిశాలోని ఒక ప్రధాన షెడ్యూల్డ్ తెగ అయిన పరజా కమ్యూనిటీకి చెందినవారు. ఈ తెగ రాష్ట్ర గిరిజన జనాభాలో దాదాపు 4 శాతం జ‌నాభాను క‌లిగి ఉంది.