స్వాతి మలివాల్, బీజేపీ మధ్య ముదురుతున్న వివాదం.. డీసీడబ్ల్యూ చీఫ్ ను సస్పెండ్ చేయాలని ఢిల్లీ ఎల్జీకి లేఖ
డీసీడబ్ల్యూ చీఫ్ ను పదవి నుంచి తొలగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ బీజేపీ లేఖ రాశారు. ఆమె చేసిన వేధింపుల ఆరోపణలపై న్యాయమైన విచారణ జరగాలంటే పదవి నుంచి సస్పెండ్ చేయాలని లేఖ రాసింది.
ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్, బీజేపీ మధ్య వివాదం ముదురుతోంది. తనపై వేధింపులు జరిగాయని మలివాల్ ఆరోపణలు చెబుతున్నందున, న్యాయమైన పోలీసు విచారణ కోసం ఆమెను సస్పెండ్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు బీజేపీ శనివారం లేఖ రాసింది.
లక్నో విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు.. కట్ చేస్తే.. నిందితుడి అరెస్ట్
జనవరి 19వ రాత్రి ఢిల్లీ రోడ్లపై తాను తనిఖీలు చేస్తుండగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తనను వేధించాడని, తన చేయిని కారు అద్దాల్లో ఇరికించి ఎయిమ్స్ వెలుపల 10-15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడని మలివాల్ గురువారం ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అనంతరం నిందితుడు హరీష్ చందర్ సూర్యవంశీ (47)ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అయితే అతడు శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసు విచారణ పూర్తయ్యే వరకు మలివాల్‌ను డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ పదవి నుండి సస్పెండ్ చేయాలని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎల్-జీని లేఖ ద్వారా అభ్యర్థించారు. దీని వల్ల ఆమె తన పదవిని దుర్వినియోగం చేయలేరని పేర్కొన్నారు.
ఆయనకు అధికారంపై అత్యాశ ఉంది.. సీఎం నితీశ్‌పై ప్రశాంత్ కిషోర్ ఫైర్
డీసీడబ్ల్యూ చీఫ్‌పై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్త అని నివేదికలు సూచిస్తున్నాయని కపూర్ తన లేఖలో చెప్పారు. నిందితుడు ఆప్ ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేస్తూ ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనను అందరూ ఖండిస్తున్నారని, దీనిపై సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు వేగంగా వ్యవహరించి గంటలోపే నిందితులను అరెస్ట్ చేయడం సంతృప్తికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
దేశంలో తొలి కరోనా నాసల్ వ్యాక్సిన్ .. జనవరి 26 నుంచి అందుబాటులోకి .. దాని ధర ఎంతంటే?
‘‘ఈ ఘటనపై సోషల్ మీడియా, అలాగే మీడియా నివేదికలన్నీ హరీష్ చంద్ర సూర్యవంశీ సంగమ్ విహార్ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చురుకైన కార్యకర్త అని తెలియజేస్తున్నాయి’’ అని ప్రవీణ్ శంకర్ కపూర్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీతో ఈవ్ టీజర్ కు ఉన్న సంబంధాన్ని ఈ పరిణామాలు బహిర్గతం చేశాయని తెలిపారు. కాబట్టి స్వాతి మలివాల్ తన రాజ్యాంగ పదవిని ఉపయోగించి ఈ కేసులో పోలీసుల విచారణను ప్రభావితం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
'రాబోయే ఎన్నికల్లో ఆయన దేశ ప్రధాని కాగలదు'
కాగా.. శుక్రవారం కూడా బీజేపీ స్వాతి మలివాల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమెను ఈవ్ టీజింగ్ చేసిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడని, ఇదంతా ఢిల్లీ పరువు తీసే కుట్రలో భాగంగా చేసిన డ్రామా అని పేర్కొంది. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి కూడా మండిపడ్డారు. ఢిల్లీ పోలీసుల ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.