Asianet News TeluguAsianet News Telugu

లక్నో విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు.. కట్ చేస్తే.. నిందితుడి అరెస్ట్   

లక్నో విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని ఓ వ్యక్తి బెదిరించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో రాష్ట్ర రాజధాని లక్నోలో కలకలం రేగింది. హడావుడిగా పోలీసులు నిఘా పెట్టి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు, అతడిని విచారిస్తున్నారు.

Man arrested for threatening to blow up Lucknow airport
Author
First Published Jan 22, 2023, 5:16 AM IST

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు రావడంతో పోలీసు యంత్రాంగంలో కలకలం రేగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. లక్నో ఎయిర్‌పోర్టును పేల్చేస్తామనే బెదిరింపుపై పోలీసులకు 112 నంబర్‌కు సమాచారం అందింది. దీనిపై పోలీసులు నిఘా పెట్టి బెదిరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకుడు మతిస్థిమితం లేనివాడని పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసుల విచారణలో ఉన్నట్టు తెలుస్తుంది. 

అంతకుముందు శనివారం సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ముంబై వెళ్తున్న రాజధాని రైలులో బాంబు పెట్టినట్లు చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రైలును 15 నిమిషాలు ఆలస్యంగా నడపాలని ఫోన్ చేసినవారు చెప్పారు. కాల్ అందుకున్న వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఢిల్లీ పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అదే సమయంలో.. ఒక బృందం కాలర్‌కు కాల్ చేసి బాంబు ఉన్న ప్రదేశం గురించి ఆరా తీస్తే, అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో కనిపించింది. దీంతో పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు సేకరించి అతడి కోసం వెతకడం ప్రారంభించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సునీల్ సాంగ్వాన్‌గా గుర్తించారు. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణ సమయంలో, అతను ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శాంత క్రూజ్‌కు చేరుకున్నానని, అయితే అతను రైలును పట్టుకోలేనని భావించాడు. అందుకే బాంబుపై తప్పుడు సమాచారం ఇచ్చాడు
 

Follow Us:
Download App:
  • android
  • ios