Asianet News TeluguAsianet News Telugu

presidential election 2022 : ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ‘జెడ్’ కేటగిరీ కల్పించిన కేంద్రం

విపక్షల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హాకు కేంద్రం జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు దాదాపు 10 మంది సీఆర్ పీఎఫ్ కమాండోలు సెక్యూరిటీ అందించనున్నారు.

The Center has given a 'Z' category to the opposition presidential candidate Yashwant Sinha
Author
New Delhi, First Published Jun 24, 2022, 3:16 PM IST

ప్రతిపక్ష పార్టీల ఉమ్మ‌డి రాష్ట్రప‌తి అభ్య‌ర్థి యశ్వంత్ సిన్హాకు కేంద ప్ర‌భుత్వం సాయుధ సీఆర్పీఎఫ్ కమాండోల జెడ్ కేటగిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది. 84 ఏళ్ల రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల‌తో ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వ ఈ నిర్ణ‌యంతో సుమారు ఎనిమిది నుండి పది మంది క‌మాండోలు వివిధ షిఫ్టుల‌లో ప‌ని చేస్తూ ఆయ‌న‌కు సెక్యూరిటీ క‌ల్పిస్తారు. ఆయ‌న దేశ వ్యాప్తంగా ఎక్క‌డికి వెళ్లినా ఎస్కార్ట్ గా ఉంటారు. 

16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు శివసేన పిటిషన్.. వాట్ నెక్స్ట్?

గతంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కూడా సీఆర్పీఎఫ్ కమాండోల జెడ్ ప్లస్ భ‌ద్ర‌త‌ను కేంద్రం క‌ల్పించింది. ఆమె ఈరోజు త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అలాగే ఎన్డీఏ పక్ష ముఖ్య నాయ‌కులు హాజ‌ర‌య్యారు. కాగా య‌శ్వంత్ సిన్హా త‌న నామినేష‌న్ ను జూన్ 27వ తేదీన దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంది. అనంత‌రం ఆయ‌న త‌న‌కు మ‌ద్ద‌తు కోరుతూ దేశ వ్యాప్తంగా ప‌లు చోట్ల‌కు ప‌ర్య‌టిస్తారు. 

Lancet journal: దేశంలో 42 ల‌క్ష‌ల మ‌ర‌ణాల‌ను త‌గ్గించిన కోవిడ్ టీకాలు !

జూన్ 27వ తేదీన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల రాజధానులను సందర్శిస్తానని య‌శ్వంత్ సిన్హా తెలిపారు. ప‌లు పార్టీ నాయకులను, అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి మద్దతు కోరుతూ ప్ర‌చారం చేస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే య‌శ్వంత్ సిన్హా ఈ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల రేసును వ్యక్తుల మధ్య కాకుండా రెండు సిద్ధాంతాల మధ్య పోటీగా అభివర్ణించారు. ఇతర భావజాలానికి చెందిన నాయకులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ఎన్నికల్లో ప్రజల ఆదేశాన్ని అపహాస్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని ఆయ‌న ఆరోపించారు. ఒక వేళ తాను రాష్ట్రప‌తిగా ఎన్నికైతే ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత, సమగ్రతను రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ,ఆయుధంగా మార్చడానికి తాను అనుమతించబోనని చెప్పారు.

Agnipath: అగ్నివీరులకు పెన్షన్ ఇవ్వకుంటే.. నా పెన్షన్ వదులుకుంటా: కేంద్రంపై బీజేపీ ఎంపీ దాడి

జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ జూన్ 21న ప్రకటించింది. అదే రోజు విప‌క్షాలు కూడా య‌శ్వంత్ సిన్హాను త‌మ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాయి. గ‌తంలో విప‌క్ష అభ్య‌ర్థిగా శ‌రద్ పవార్, గోపాల‌కృష్ణ గాంధీ, ఫ‌రుక్ అబ్దుల్లా పేర్ల‌ను ప్ర‌తిపాదించ‌గా.. వారు సున్నితంగా తిర‌స్క‌రించారు. దీంతో టీఎంసీ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న య‌శ్వంత్ సిన్హా పేరు తెర‌మీద‌కి వ‌చ్చింది. దీంతో ఆయ‌న టీఎంసీకి రాజీనామా చేశారు. అనంత‌రం సిన్హా పేరు అధికారంగా ప్ర‌క‌టించారు. కాగా ప్రస్తుత రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ వారసుడిని ఎన్నుకోవడానికి జూలై 18వ తేదీన ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు జూన్ 29 చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు జూలై 21వ తేదీన వెలువ‌డుతాయి. రామ్ నాధ్ కోవింద్ ప‌ద‌వి కాలం జూలై 24వ తేదీన ముగియ‌నుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios