Asianet News TeluguAsianet News Telugu

16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు శివసేన పిటిషన్.. వాట్ నెక్స్ట్?

16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన పార్టీ డిప్యూటీ స్పీకర్‌ను కోరింది. చీఫ్ విప్ ఆదేశాలను వారి ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ విజ్ఞప్తి చేసింది. ఈ 16 మంది ఎమ్మెల్యేల్లో ఏక్‌నాథ్ షిండే కూడా ఉన్నారు.
 

disqualify 16 rebel MLAs including eknath shinde shivsena urges deputy speaker
Author
Mumbai, First Published Jun 24, 2022, 3:12 PM IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయ హైడ్రామా ఇంకా కొనసాగుతున్నది. తాజాగా, రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శివసేన నిర్ణయం తీసుకుంది. 12 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి శివసేన పిటిషన్ ఇచ్చింది. తాజాగా, మరో నలుగురి పేర్లనూ ఇందులో చేర్చి వారిపైనా అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ను కోరింది.

రెబల్ ఎమ్మెల్యేలకు సారథ్యం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే సహా 16 మందిపై అనర్హత వేటు వేయాలని శివసేన పిటిషన్ ఇచ్చింది. చీఫ్ విప్ ఆదేశాలు పంపినా.. వీరు వాటిని అనుసరించి మీటింగ్‌కు హాజరుకాలేదుని, వీరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌ను డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ పరిశీలించనున్నారు. అనంతరం, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్.. వారికి నోటీసులు పంపే అవకాశాలు ఉన్నాయి. ఈ పిటిషన్‌పై క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఆ ఎమ్మెల్యేలను హాజరు కావాలని డిప్యూటీ స్పీకర్ అడగనున్నారు.

శివసేన పార్టీ చేసిన ఆరోపణపై ఎమ్మెల్యేలు భౌతికంగా వచ్చి తమ వివరణను డిప్యూటీ స్పీకర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కరోనా కారణంగా ఈ పిటిషన్‌పై విచారణ కూడా వర్చువల్ నిర్వహించే సదుపాయం వచ్చింది. అయితే, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నుంచి అందబాటులో ఉన్న బ్యాండ్‌విడ్త్ ప్రకారం ఒక రోజులో ఇద్దరి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను వర్చువల్‌గా విచారించే సౌలభ్యం ఉన్నది.

అయితే, ఇదిద క్వాసి జ్యూడీషియల్ ప్రాసెస్. కాబట్టి, ఈ వ్యవహారం అంతా సమయభావంతో కూడుకున్న పని. ఇందుకు అసలు టైమ్ ఫ్రేమ్ అనేదే లేదు. అంటే.. నిర్దిష్ట సమయంలోపు ఈ చర్యలు ముగిసిపోవాలన్న నిబంధనలు ఏవీ లేవు. కాానీ, అసెంబ్లీ.. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది.

అనర్హత వేటు వేయాలని శివసేన పార్టీ కోరిన ఎమ్మెల్యేలు వీరే.
1. ఏక్‌నాథ్ షిండే
2. మహేష్ షిండే
3. అబ్దుల్ సత్తార్
4. భరత్ గోగవాలే
5. సంజయ్ శిర్సత్
6. యామిని జాదవ్
7. అనిల్ బాబర్
8. తానాజీ సావంత్
9. లాతా సోన్‌వానే
10. ప్రకాశ్ సుర్వే
11. బాలాజీ కినికార్
12. సందీపన్ భూమ్రే
13. బాలాజీ కళ్యాంకర్
14. రమేశ్ బొర్నారే
15. చిమన్‌రావ్ పాటిల్
16. సంజయ్ రైముంకార్

Follow Us:
Download App:
  • android
  • ios