Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో రాజకీయ నాయకుడిగా ఉండటం చాలా కష్టం - శాన్ ఫ్రాన్సిస్కోలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

భారత్ లో ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం చాలా కష్టంగా మారిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం ఏజెన్సీలను వాడుకుంటోందని ఆరోపించారు. ఆ సంస్థలను ప్రజలపై ప్రయోగిస్తున్నారని విమర్శించారు. 

Being a politician in India is tough - Congress leader Rahul Gandhi in San Francisco..ISR
Author
First Published May 31, 2023, 11:24 AM IST

10 రోజుల అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం శాన్ ఫ్రాన్సిస్కోలో ‘మొహబ్బత్ కీ దుకాన్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో రాజకీయాలకు అవసరమైన అన్ని సాధనాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తున్నాయని చెప్పారు. భారత్ లో రాజకీయ వాతావరణం క్లిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలను బెదిరిస్తున్నారని, ఏజెన్సీలను ప్రజలపై ప్రయోగిస్తున్నారని రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.  భారత్ లో ఒక రకంగా రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం కూడా చాలా కష్టంగా మారిందని చెప్పారు.

వార్నీ.. 10 రూపాయిల పందెంలో గెలిచేందుకు రద్దీ రోడ్డుపై స్నానం.. పోలీసులు ఏం చేశారంటే ? వీడియో వైరల్

బీజేపీ ప్రజలను బెదిరిస్తున్నదని, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలతో మమేకం కావడానికి అవసరమైన అన్ని సాధనాలను బీజేపీ-ఆరెస్సెస్ నియంత్రిస్తుస్తోందని అందుకే ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభమైందని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యాప్తి చేస్తున్న విద్వేషాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘మొహబ్బత్ కీ దుకాన్’సయీద్ ఆలోచనపై రాహుల్ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో తమతో మనుషులే నడవలేదని, ప్రజల ప్రేమ కూడా నడిచిందని అన్నారు. అప్పుడే ప్రేమ దుకాణం తెరవాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.

‘‘భారత్ జోడో యాత్ర ప్రేమ, గౌరవం, హాస్య స్ఫూర్తిని నింపింది. చరిత్రను పరిశీలిస్తే గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురుతో సహా ఆధ్యాత్మిక నాయకులందరూ ఒకే విధంగా దేశాన్ని ఏకం చేశారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. భారీ వక్రీకరణ ఉందని చెబుతూ.. వాస్తవానికి దూరంగా ఉన్న రాజకీయ కథనాన్ని ప్రమోట్ చేస్తూ మీడియాలో చూపిస్తున్నది అసలైన భారతదేశం కాదని అన్నారు. ఇలాంటి విషయాలను ప్రమోట్ చేయడం కేవలం మీడియా ప్రయోజనాల కోసమేనని అన్నారు. 

స్నేహితుడు మరణించాడని అంత్యక్రియలకు వచ్చిన అఘోర.. మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో..

బీజేపీకి ఐటీ సహకరిస్తుందని ఈ ప్రయాణంలో తనకు స్పష్టంగా అర్థమైందని రాహుల్ గాంధీ అన్నారు. కాబట్టి మీడియాలో కనిపించేవన్నీ నిజాలని అనుకోవద్దని ఆయన సూచించారు. ‘‘భారత్ అంటే మీడియా చూపించేది కాదు. మీడియా ఒక నిర్దిష్ట కథనాన్ని చూపించడానికి ఇష్టపడుతుంది. వాస్తవానికి భారత్ లో జరుగుతున్నది కాదని రాజకీయ కథనాన్ని ప్రమోట్ చేయడానికే అది ఇష్టపడుతోంది’’ అని ఆయన అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios