కోపంలో భార్యను షూట్ చేసి చంపాడు.. గుండెపోటుతో తనూ కుప్పకూలిపోయాడు.. క్షణాల్లో ఇద్దరు మృతి
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి భార్యతో జరిగిన గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తుపాకీ తీసి భార్యను రెండు రౌండ్లు షూట్ చేశాడు. ఆమె మరణించింది. ఆ వెంటనే అతను కూడా గుండెపోటుతో నేలకూలిపోయాడు. ఇద్దరి డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ పంపించారు.
ముంబయి: మహారాష్ట్రలో ఎవరూ ఊహించని దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ భర్త.. భార్యతో గొడవపడి తుపాకీ తీసి షూట్ చేశాడు. రెండు రౌండ్లు కాల్చాడు. ఆమె నేలపై పడిపోయింది. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ శ్వాస విడిచింది. భార్యను షూట్ చేసిన తర్వాత భర్తకు గుండెపోటు వచ్చింది. ఆయన కూడా కుప్పకూలిపోయాడు. కొన్ని క్షణాల వ్యవధిలోనే వారిద్దరూ మృతి చెందారు. ఒకరు హత్యకు గురైతే.. మరొకరు అనారోగ్యానికి ప్రాణం వదిలారు. ఈ ఘటన థానేలోని కల్వాలో కుంభర్ అలీలో శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
56 ఏళ్ల దిలీప్ సాల్వి, 51 ఏళ్ల ప్రమీల దంపతులు. ప్రాబల్య కుటుంబానికి చెందినవారు. ఆ ఏరియాలో మంచి పేరున్న కుటుంబం. శుక్రవారం దిలీప్ సాల్వి రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత భార్యతో గొడవ జరిగింది. ఇద్దరూ వాదులాడుకున్నారు. కోపంలో దిలీప్ సాల్వి తుపాకీ తీశాడు. రెండు రౌండ్లు భార్యపై కాల్పులు జరిపాడు. తుపాకీ తీయగానే.. ప్రమీల కొడుకును బిగ్గరగా అరుపు వేస్తూ పిలిచింది. కొడుకు వచ్చే లోపే దిలీప్ సాల్వి ఆమెను కాల్చేశాడు.
Also Read: Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 మిషన్‌కు ఖర్చు ఎంత? చంద్రయాన్ 3 కంటే తక్కువేనా?
భార్యను షూట్ చేసిన వెంటనే ప్రమోద్ సాల్వి కూడా వణుకుతూ కింద కూలిపోయాడు. చనిపోయాడు. గుండెపోటుతోనే ప్రమోద్ సాల్వి మరణించినట్టు తెలుస్తున్నది. ఈ విషయాలను ఓ పోలీసు అధికారి తెలిపారు.
డీసీపీ (జోన్ 1) గణేశ్ గవాడే స్పాట్‌కువెళ్లారు. దర్యాప్తు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. ఆ భార్యా భర్తల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నట్టు ఓ వార్త వచ్చింది.