భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాది చేసిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు తిప్పకొట్టాయి. అతడిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపాయి. దీంతో ఉగ్రవాది హతమయ్యాడు. ఇది జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది. 

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు శుక్రవారం హతమార్చాయని అధికారులు తెలిపారు. కర్నాహ్ ప్రాంతంలోని జబ్డీ వద్ద నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను ఉదయం సైనికులు గమనించారు. దీంతో ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆ ఉగ్రవాది హతమయ్యారు.

'వసుధైక‌ కుటుంబం' భావజాలంలో భారతదేశ ప్రతిష్ఠ ప్రతిబింబిస్తోంది.. : ప్ర‌ధాని మోడీ

‘‘భద్రతా దళాలు చొరబాటుదారుడిని సవాలు చేశాయి. తరువాత జరిగిన కాల్పుల్లో ఒక చొరబాటుదారుడు మరణించాడు’’ అని అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు ఒక ఏకే రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నాయని పేర్కొన్నారు.

Scroll to load tweet…

అంతకు ముందు గురువారం జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారని, రాజౌరి జిల్లాలోని డాంగ్రీ గ్రామంలో అమాయక ప్రజలను చంపారని అన్నారు. చొరబాట్లు తగ్గినప్పటికీ, సరిహద్దుల ఆవల నుంచి ఇక్కడ ఉగ్రవాద చర్యలను ఆపరేట్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

‘మోడీ ఇంటి పేరు’ కేసులో రాహుల్ గాంధీకి శిక్ష.. తీర్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ భారీ నిరసన

‘‘చొరబాటు పెరిగిందని నేను చెప్పలేదు. చొరబాట్లు తగ్గాయని చెప్పాను. చొరబాటు మిగిలిన ప్రయత్నాలకు ముగింపు పలకాలని నేను చెప్పాను. సరిహద్దుల ఆవల నుండి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు, ఏ రకమైన ఉగ్రవాదానికి పాల్పడినట్లు తేలినా వారిని విడిచిపెట్టం. అది జర్నలిస్టు లేదా ఎవరైనా సరే’’ అని సింగ్ అన్నారు.