Varanasi: "సవాలు ఎంత పెద్దదైనా, అందరూ ప్రయత్నించినప్పుడు సమస్య పరిష్కారానికి కొత్త మార్గం కూడా దొరుకుతుందనడానికి వారణాసి నిదర్శనం. కాశీ అభివృద్ధి గురించి దేశంలోనూ, ప్రపంచంలోనూ చర్చ జరుగుతోంది. ఇక్కడకు ఎవరు వచ్చినా కొత్త ఎనర్జీ వస్తోంది" అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Prime Minister Narendra Modi: 'వసుధైక కుటుంబం' అనే భారత భావజాలం ఆధునిక ప్రపంచానికి సమగ్ర దార్శనికత, అనేక సమస్యలకు పరిష్కారాలను అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జరిగిన 'వన్ వరల్డ్ టీబీ సమ్మిట్'లో ఆయన ప్రసంగించారు. "వసుధైక కుటుంబం' (ఒకే ప్రపంచ ఒకే కుటుంబం) అనే భావజాలంలో భారతదేశ ప్రతిష్ఠ ప్రతిబింబిస్తుంది. ఈ పాత ఆలోచన ఆధునిక ప్రపంచానికి సమగ్ర దార్శనికతను, పరిష్కారాలను ఇస్తోంది" అని పేర్కొన్నారు. టీబీ రహిత పంచాయతీ, దేశవ్యాప్తంగా టీబీ ప్రివెంటివ్ ట్రీట్ మెంట్ (టీపీటీ), క్షయవ్యాధికి కుటుంబ కేంద్రీకృత సంరక్షణ నమూనా వంటి అనేక కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
2023 సంవత్సరానికి గాను భారత వార్షిక టీబీ రిపోర్టును ప్రధాని విడుదల చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ హై కంటైన్మెంట్ (బీఎస్ఎల్) ల్యాబొరేటరీకి శంకుస్థాపన చేసిన ప్రధాని మెట్రోపాలిటన్ పబ్లిక్ హెల్త్ సర్వైలెన్స్ యూనిట్ కూడా ఆవిష్కరించారు. "సవాలు ఎంత పెద్దదైనా, అందరూ ప్రయత్నించినప్పుడు సమస్య పరిష్కారానికి కొత్త మార్గం కూడా దొరుకుతుందనడానికి వారణాసి నిదర్శనం. కాశీ అభివృద్ధి గురించి దేశంలోనూ, ప్రపంచంలోనూ చర్చ జరుగుతోంది. ఇక్కడకు ఎవరు వచ్చినా కొత్త ఎనర్జీ వస్తోంది. 8-9 సంవత్సరాల క్రితం కాశీ ప్రజలు తమ నగరాన్ని పునరుజ్జీవింపచేస్తామని ప్రతిజ్ఞ చేసినప్పుడు, బెనారస్ లో మార్పు రాదని, కాశీ ప్రజలు విజయం సాధించలేరని చాలా మంది భయపడ్డారంటూ" ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
వారణాసి పర్యటనలో భాగంగా సంపూర్ణానంద విశ్వవిద్యాలయంలో ప్రధాని మోడీ, అంతకుముందు సీఎం యోగి ప్రసంగించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ నేడు జీ20ని ముందుకు నడిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచం ముందు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని స్వీకరించడానికి ప్రపంచం ఆసక్తిగా ఉందని తెలిపారు. యూపీ నుంచి వెళ్లి దేశ ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టే వారు చాలా మంది ఉన్నారని చెప్పిన యోగి.. ప్రధాని వచ్చినప్పుడల్లా కాశీకి కొత్త కానుక తెస్తారనీ, ఈసారి కాశీ కోసం 1780 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను తీసుకువచ్చారని తెలిపారు.
