Asianet News TeluguAsianet News Telugu

విన్నూత ఆలోచన‌ల‌తో రండి.. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి : మంత్రి కేటీఆర్

ప్లాస్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు దేశ రాజ‌ధాని ఢిల్లీలో జరిగే ‘ప్లాస్ట్‌ ఇండియా 2023’ ప్రమోషన్, రిజిస్ట్రేషన్, యాప్ ను మంత్రి కేటీఆర్‌ శనివారం ఆవిష్కరించారు.

Telangana Minister KTR says Entrepreneurship Culture Will Create Jobs
Author
Hyderabad, First Published Aug 21, 2022, 7:14 AM IST

తెలంగాణ రాష్ట్రం బిజినెస్ ఫ్రెండ్లీ రాష్ట్రమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచదేశాల నుండి తెలంగాణ‌లో పెట్టుబడులు పెట్టేవారిని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్లాస్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు దేశ రాజ‌ధాని ఢిల్లీలో జరిగే ‘ప్లాస్ట్‌ ఇండియా 2023’ ప్రమోషన్, రిజిస్ట్రేషన్, యాప్ ను మంత్రి కేటీఆర్‌ శనివారం ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణపై కూడా దృష్టి సారించాలని సూచించారు. వ‌చ్చే యేడాదిలో జ‌రిగే..  ప్లాస్ట్ ఇండియా ప్రమోషన్స్ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జిబిషన్‌ విజయవంతం కావాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. అయితే.. ఇటీవలి కాలంలో ఢిల్లీతో తమకు  సత్సంబంధాలు లేవని సెటైర్ వేశారు. భార‌త్ లో 6వ లార్జెస్ట్ ఎకానమీ కలిగిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.  చైనా ఎకానమీని భార‌త్ ఎందుకు బీట్ చేయలేక‌పోతుంద‌నీ, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో  మార్పులు రావాలన్నారు. ఇండియాలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్ట్‌ ఇండియా ఎగ్జిబిషన్‌ విజయవంతం కావాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. 

 2025 నాటికి తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న విశాఖ సంస్థ యాజమాన్యం ప్రకటించింది.  ఈ నేప‌థ్యంలో గుజరాత్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎన్నో ఏళ్ళ నుండి మొదలైంది. గుజరాతీలు వారసత్వంగా వచ్చే వ్యాపారాల్లో ఉంటూనే.. కొత్త రంగాల్లో తమ పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని, రోజురోజు వారు త‌న ప్రతిభను నిరూపించుకుంటారని కొనియాడారు.

గుజరాతీ వారి ఎంట్రప్రెన్యూర్స్‌ను ఆదర్శంగా తీసుకోవాల‌ని అన్నారు. ఎంట్రప్రెన్యూర్‌ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి వచ్చే పెట్టుబడిదారులు తెలంగాణ లాంటి అనువైన రాష్ట్రాన్ని ఎంచుకుని కార్యకలాపాలు ప్రారంభించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఒకప్పుడు చైనా, ఇండియా జీడీపీ ఒక్కటే.. కానీ.. ఇరు దేశాల జీడీపీ లు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. మ‌న దేశ ఆర్థికాభివృద్ది 3 ట్రిలియన్లు ఉంటే.. చైనా 16 ట్రిలియన్లకు చేరిందని అన్నారు.  

తెలంగాణకు పెట్టుబడులు వస్తే.. ఉపాధి మార్గాలు పెరుగుతాయని కేటీఆర్ అన్నారు. రీసైకిల్ ప్లాస్టిక్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నమని తెలిపారు. వినూత్న ఆలోచ‌న‌ల‌తో తెలంగాణ‌లో పెట్టుబడులు పెట్టండని కోరారు. తెలంగాణలో సస్టెయినబులిటీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ పై సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్లాస్టిక్ బ్యాన్ చేయడం మంచిది.. కానీ ప్రజలకు ఆల్టర్ నేట్ చూపించాలి లేదంటే ఇది పేపర్ కే పరిమితమవుతుందన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్లాస్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ చైర్మన్‌ జిగేశ్‌ దోషి, నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అజయ్‌షా, కో చైర్‌పర్సన్‌ పద్మజారెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios