తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తూ జారీ చేసిన జీవో ఫేక్ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ఈ విషయం కావాలంటే తెలంగాణకు వెళ్లి పరిశీలించుకోవాలని ఉద్యోగులకు సూచించారు.  

ఉద్యోగులను రెగ్యులరైజేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఫేక్ అని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాను చెప్పింది నిజామా ? కాదా ? అని తెలుసుకోవాలని అనుకుంటే తెలంగాణకు వెళ్లి చూడాలని వైద్యరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా వారిపై మంత్రి మండిపడ్డారు.

మణిపూర్ లో తారా స్థాయికి అల్లర్లు.. కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు

ఏపీలోని పలు జిల్లాల్లోని వివిధ డిపార్ట్ మెంట్లకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం విజయనగరంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని అభ్యర్థించారు. దీనికి మంత్రి స్పందించారు. వారితో మాట్లాడుతూ.. తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు ఓ జీవో విడుదల చేసిందని, దాని వల్ల కేవలం 960 మందికే ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. కానీ ఏపీలో 10 వేల మందిని రెగ్యులర్ చేస్తామని తెలిపారు.

ఒక వేళ ఇప్పుడు రెగ్యులర్ చేయడం కుదరకపోతే, మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత 2026లో తప్పకుండా చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నాన్ టీచింగ్ సిబ్బంది ఈ లోపు ప్రమోషన్లు వస్తే 2026 వరకు తమకు ఉద్యోగాలు ఉండవని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి వారిపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ తెలియకుండా మాట్లాడకూదని వారికి సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడికీ పోవని అన్నారు. దానికి తాను గ్యారెంటీ ఇస్తానని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తాము తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను మంత్రితో ప్రస్తావించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చి బోగస్ జీవో అని అన్నారు. ఈ విషయంలో స్పష్టతరావాలంటే తెలంగాణకు వెళ్లాలని, కావాలంటే తాను డబ్బులు ఇస్తానని వారికి చెప్పారు. 

సెంథిల్ బాలాజీ టెర్రరిస్టా? 18 గంటల పాటు హింసించడం వల్లే ఛాతీ నొప్పి - సీఎం స్టాలిన్ సంచలన ఆరోపణలు

కాగా.. గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో ఉన్న వైసీపీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏపీలో రూ.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం సరికాదని అన్నారు. తమను నిర్మాణాత్మకంగా విమర్శించాలని, ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడం తప్పని అన్నారు. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు ఆరోపణలు అన్నీ అవాస్తవాలని అన్నారు. సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారని అన్నారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ అంటే అంత ప్రేమ ఉంటే..ఇంకా ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. 

ఉత్తరకాశీ మత ఉద్రిక్తత : పురోలాలో జరగని ‘మహాపంచాయత్’..కొనసాగుతున్న 144 సెక్షన్

ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా మంత్రి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ యాత్ర చేస్తే తమకు ఏమవుతుందని ప్రశ్నించారు. ఆయన యాత్ర మొదలుపెట్టి 24 గంటలు గడిచిపోయాయని, ఆటంకాలేమైనా ఎదురయ్యాయా ? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం వారికి వారే ఏమేమో సృష్టించుకోవడం మంచిది కాదని హితవు పలికారు.