మణిపూర్ లో హింసాత్మక ఘర్షణలు ఇంకా తగ్గడం లేదు. ఇటీవలే పలువురు దుండగులు బీజేపీ నేత, ఆ రాష్ట్ర మంత్రి నెమ్చా కిప్జెన్ ఇంటిని తగులబెట్టిన ఘటన మరవకముందే.. శుక్రవారం తెల్లవారుజామున కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇంపాల్ లో ఉన్న కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇంటికి నిప్పు అంటించారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో కొనసాగుతున్న అల్లర్లు తారా స్థాయికి చేరుకున్నాయి. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంఫాల్ లో ఉన్న కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇంటికి శుక్రవారం తెల్లవారుజామున నిప్పు పెట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. కాగా.. ఈ వారం ప్రారంభంలో రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నెమ్చా కిప్జెన్ ఇంటిని కూడా దుండగులు తగలబెట్టిన సంగతి తెలిసిందే.
ఉత్తరకాశీ మత ఉద్రిక్తత : పురోలాలో జరగని ‘మహాపంచాయత్’..కొనసాగుతున్న 144 సెక్షన్
షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్ పై మణిపూర్ లో కొంత కాలంగా రెండు వార్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఈ అల్లర్లపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పలు స్థాయిల్లో చర్చలు జరుపుతోందని అన్నారు. హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గవర్నర్ శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేశారని, శాంతి కమిటీ సభ్యులతో సంప్రదింపులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో సాధ్యమైనంత త్వరగా శాంతిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పడం అంత సులభం కాదని, కానీ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన అన్నారు.
చెప్పులు కనిపించడం లేదంటూ మాజీ మేయర్ ఫిర్యాదు.. 4 వీధి కుక్కలను బంధించి, స్టెరిలైజ్ చేసిన అధికారులు
‘‘చాలా మంది తమ ఆత్మీయులను కోల్పోయారు. మరి కొందరు ఆస్తిని కోల్పోయారు. అందుకే ఆ రకమైన భావోద్వేగాలు ఉన్నాయి. కాబట్టి అంతా సవ్యంగా ఉంటుందని మేము వెంటనే చెప్పలేము. కానీ ప్రభుత్వ కృషితో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా అది తగ్గుతోందని మీరు చూశారు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి బీరెన్ సింగ్ అన్నారు. కాగా.. మణిపూర్ లో బుధవారం జరిగిన తాజా హింసాకాండలో 9 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు.
మణిపూర్ లో హింసకు కారణమేంటి ?
మీటీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ కేటగిరీలో చేర్చాలనే డిమాండ్ కు నిరసనగా ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్ యూ) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణల కారణంగా మణిపూర్ లో మే నెల ప్రారంభం నుంచి హింస చెలరేగింది. మీటీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలించాలని మణిపూర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
అమృత్ పాల్ సహాయకుడు, ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖండా మృతి.. ఏమైందంటే ?
హింసాకాండ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 29 నుంచి నాలుగు రోజుల పాటు మణిపూర్ లో పర్యటించి రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు పలు చర్యలు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌర సమాజం, మహిళలు, గిరిజన సంఘాలు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని అమిత్ షా ప్రకటించారు.
