ఉత్తరకాశీలోని పురోలాలో గతంలో విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చిన ‘మహా పంచాయత్’ గురువారం జరగలేదు. మత ఉద్రిక్తల నేపథ్యంలో స్థానిక యంత్రాంగం 144 సెక్షన్ విధించింది. దీంతో పాటు పాటు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మితవాద సంస్థల సభ్యులను సిటీకి దూరంగానే ఆపేశారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా యంత్రాంగం సీఆర్పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించడం, జూన్ 19 వరకు నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించడంతో పురోలా పట్టణంలో మితవాద గ్రూపులు పిలుపునిచ్చిన మహాపంచాయత్ గురువారం జరగలేదు.
ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన మహారాష్ట్ర బాలిక.. వరుసగా ఐదు రోజుల పాటు డ్యాన్స్..
లవ్ జిహాద్ ఘటనలకు వ్యతిరేకంగా మితవాద గ్రూపులు, ప్రధానంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ), భజరంగ్ దళ్ పిలుపునిచ్చిన మహాపంచాయత్ జరగకపోగా, భజరంగ్ దళ్ కు చెందిన కొందరు సభ్యులు పురోలా స్టేడియానికి చేరుకుని తమ నిరసనను తెలియజేశారు. అయితే మహాపంచాయత్ కు హాజరయ్యేందుకు ప్రయత్నించిన వారి పలు వాహనాలను పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోని నౌగావ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా నిరసన తెలుపుతూ ‘జై శ్రీరామ్, హిందూ ఏక్తా’ అంటూ నినాదాలు చేశారు.
ఉత్తరకాశీ జిల్లాలోని పురోలాతో పాటు మరికొన్ని పట్టణాల్లో మే 26న ఓ హిందూ బాలికను అపహరించేందుకు ఇద్దరు యువకులు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ పట్టణంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కాగా.. ‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ జూన్ 15 (నేడు)న మహాపంచాయత్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. దీంతో స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
పురోలా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దేవానంద్ శర్మ జూన్ 14 నుండి జూన్ 19 వరకు నగర పంచాయతీ పురోలా ప్రాంతంలో సెక్షన్ 144 కింద నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధిస్తూ నిషేధాజ్ఞలు విధించారు. ఏదైనా మత, రాజకీయ లేదా సాంస్కృతిక కార్యక్రమాలకు, పరిపాలన లేదా పోలీసుల నుండి అనుమతి అవసరమని చెప్పారు.
‘‘పురోలా ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని క్రిమినల్ సంఘటనలు, దాని వల్ల తలెత్తిన ప్రజాగ్రహం దృష్ట్యా శాంతిభద్రతలకు కొంత మంది విఘాతం కలిగించే అవకాశం ఉంది. గతంలో జరిగిన సంఘటనలకు ప్రతిస్పందనగా కొన్ని సంస్థలు, వ్యక్తులు ఈ ప్రాంతంలో ప్రదర్శనలు లేదా ర్యాలీలు నిర్వహించడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే అవకాశం ఉందని తమ దృష్టికి వచ్చింది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చెప్పులు కనిపించడం లేదంటూ మాజీ మేయర్ ఫిర్యాదు.. 4 వీధి కుక్కలను బంధించి, స్టెరిలైజ్ చేసిన అధికారులు
ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని పోలీసులకు, అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతిని కాపాడాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఘటనలపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని, ఎలాంటి ఘర్షణలు, దోపిడీ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. అయినా తాము శాంతిని కాపాడతామని, ఎవరైనా దోషులుగా తేలితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అందరికీ చెప్పాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరికీ అనుమతి లేదు' అని ధామీ అన్నారు.
కాగా.. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని పక్షాలు సహకరించాలని, శాంతికి విఘాతం కలిగించేందుకు ఎవరినీ అనుమతించబోమని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎవరూ చట్టాన్ని ఉల్లంఘించకుండా బలగాలను మోహరించామని, పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. జిల్లా యంత్రాంగం నిరంతరం సమావేశాలు నిర్వహిస్తోందని శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ వి.మురుగేశన్ తెలిపారు. ఏదైనా వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
