Asianet News TeluguAsianet News Telugu

ములాయం సింగ్ యాదవ్ భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు.. అఖిలేష్‌కి ఓదార్పు

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములాయం భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన.. అఖిలేష్ యాదవ్‌ను ఓదార్చారు. 
 

telangana cm kcr pays tribute to mulayam singh yadav
Author
First Published Oct 11, 2022, 3:17 PM IST

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని ములాయం స్వగ్రామం సైఫాయ్‌కి చేరుకున్న చంద్రశేఖర్ రావు.. ఆయన పార్ధివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ములాయం కుటుంబ సభ్యుల్ని పరామర్శించి కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ని ఓదార్చారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్‌ నేతలు కూడా ములాయం అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ములాయంను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. సైఫాయ్ జనసంద్రంగా మారిపోయింది. ఈ కార్యక్రమంలో ముగిసిన అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు కేసీఆర్. రెండ్రోజుల పాటు అక్కడే వుండనున్నారు ముఖ్యమంత్రి. 

కాగా.. గత నెల రోజులుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం సింగ్ యాదవ్ సోమవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలసిందే. ములాయం మృతి ప‌ట్ల‌ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా దేశంలోని అగ్ర‌నేతలంతా సంతాపం తెలిపారు. 

ALso REad:ములాయం సింగ్ యాదవ్ ఆస్తులు ఎంత?.. ఎన్ని కోట్ల యజమాని? ఎంత విడిచి వెళ్లారు?

ములాయం 1990లలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా, ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి పూర్తి మెజారిటీ రావడంతో ములాయం సింగ్ యాదవ్ తన అధికార పీఠాన్ని తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు అప్పగించారు. 2017 జనవరిలో ఎస్పీ అధ్యక్షుడిగా అఖిలేష్ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎస్పీలో ములాయం హోదా 'నేతాజీ'గా కొనసాగింది. యాదవ్ తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ప్రతి విజయం, వైఫల్యంలో ఆయ‌న  ఎస్పీ కార్యకర్తలతో పంచుకున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios