హిందూ విద్యార్థి టీసీలో ‘ముస్లిం’ అని రాసిన టీచర్లు.. బలవంతంగా నమాజ్.. మత మార్పిడికి ప్రయత్నం.
హిందూ విద్యార్థి మతమార్పిడి చేసేందుకు ఇద్దరు టీచర్లు ప్రయత్నించారు. (Teachers write 'Muslim' on Hindu student's TC) అలాగే పలువురితో బలవంతంగా నమాజ్ చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇది రాజస్థాన్ (Rajasthan)లోని కోటా (KOTA) జిల్లాలో జరిగింది.
హిందూ మతానికి చెందిన ఓ బాలికను ముస్లిం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించిన ఘటన రాజస్థాన్‌లోని కోటాలో వెలుగులోకి వచ్చింది. సంగోడ్ పట్టణానికి సమీపంలోని ఖజూరి గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఓ హిందూ బాలిక టీసీలోని మతం కాలంలో ముస్లిం అని రాశారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, హిందూ మత సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని మతమార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పవిత్ర స్నానాలకు వెళ్తుండగా అపశృతి.. చెరువులో ట్రాక్టర్ బోల్తా పడి 15 మంది మృతి..
ఈ ఘటనపై ఫిర్యాదులు అందటంతో ఫిరోజ్ ఖాన్, మీర్జా ముజాహిద్ అనే టీచర్ లను కోటా జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు. షబానా అనే టీచర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. టీచర్ల తీరుపై బజరంగ్ దళ్ కార్యకర్తలు రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే లాస్యను వెంటాడిన ప్రాణ భయం.. ఒంటిపై 12 తాయత్తులు..
దీంతో ఆయన స్పందించారు. ఖజూరి గవర్నమెంట్ స్కూల్ లో చదివిని ఓ హిందూ బాలిక టీసీలోని మతం కాలంలో ముస్లిం అని రాసి ఉండటం తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. వారు మత మార్పిడి, లవ్ జిహాద్ కోసం కుట్ర పన్నుతున్నారని, హిందూ యువతులతో బలవంతంగా నమాజ్ చేయిస్తున్నారని తనకు ఫిర్యాదులు అందాయని తెలిపారు.
ఆ ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించామని, షబానా అనే ఒక టీచర్‌పై త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తదుపరి విచారణ ఆధారంగా, ఉపాధ్యాయులను కూడా సర్వీస్ నుండి తొలగించే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు మంత్రి మదన్ దిలావర్ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.