ఎమ్మెల్యే లాస్యను వెంటాడిన ప్రాణ భయం.. ఒంటిపై 12 తాయత్తులు..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Secunderabad Cantonment MLA Lasya Nanditha)ను ప్రాణ భయం వెంటాడినట్టు తెలుస్తోంది. రెండు సార్లు ప్రమాదాల బారిన తృటిలో తప్పించుకున్న ఆమె ఆలయాలను, దర్గాలను సందర్శించారు. అక్కడ తాయత్తులను కట్టించుకున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె మరణంతో యావత్ తెలంగాణ ఒక్క సారిగా షాక్ కు గురయ్యింది. కంటోన్మెంట్ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందిన ఆమె.. చిన్న వయస్సుల్లోనే చనిపోవడం నియోజకవర్గ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను విడతల వారీగా పరిష్కరించుకుంటూ వచ్చిన ఆమె.. ఎమ్మెల్యేగా గెలిచిన కొంత కాలంలోనే ప్రజల్లో చెరగని ముద్ర వేశారు.
పబ్లిక్ పార్కుల్లో రొమాన్స్.. జంటలను అదుపులోకి తీసుకున్న షీ టీమ్స్..
కాగా.. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్య నందితకు రెండు సార్లు ప్రమాదాలు జరగాయి. దీంతో ఆమెను ప్రాణ భయం వెంటాడినట్టు తెలుస్తోంది. కొన్ని నెలల కిందట ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభానికి వెళ్లి లిఫ్ట్ లో ఇరుక్కున్నారు. సుమారు గంట పాటు అందులోనే నరకం అనుభవించారు. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన నల్గొండ సభకు వెళ్లి వస్తూ కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ రెండు ప్రమాదాల నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే లాస్య నందితకు కూడా అర్థం అయ్యింది. దీంతో ఆమె ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దర్గాలు, బాబాల వద్దకు కూడా వెళ్లారు. వారివద్ద తయత్తులు కట్టించుకున్నారు. ఆమె మరణించిన అనంతరం గాంధీ హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహిస్తున్న డాక్టర్లు వాటిని గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న సుమారు 12 తాయత్తులను తొలగించారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు.
Dalit: సాయన్న నోచుకోలేదు.. లాస్య నందితకు దక్కుతున్న గౌరవం
అయితే రెండు ప్రమాదాల నుంచి ప్రాణాలతో భయటపడిన ఆమె.. మూడో ప్రమాదంలో తీవ్ర గాయాలపై చనిపోయారు. సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరిలో ఆమె తండ్రి, దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడం యాదృశ్చికం. దీంతో ఆ కుటుంబానికి ఫిబ్రవరి నెల కలిసి రాలేదని స్థానికులు చర్చించుకున్నారు. సాయన్న తన కూతురు లాస్యను ఎమ్మెల్యేగా చూడాలని తాపత్రేయపడేవారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు. తరువాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తండ్రి సీటును కూతురు లాస్యకు ఇవ్వడంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
జర్నలిస్ట్ శంకర్ పై మూకుమ్మడి దాడి.. సీసీ కెమెరాలో ఘటన రికార్డు.. ఖండించిన మాజీ మంత్రులు..
ఎమ్మెల్యేగా గెలిచనప్పటి నుంచి నియోజకవర్గ సమస్యలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా నీటి ఎద్దడి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందరితో కలిసిపోతూ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ అంతలోనే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మారేడ్‌పల్లిలోని స్మశానవాటికలో జరిగాయి. దీనికి బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.